కడపాయపల్లి దళితుల హెచ్చరిక
దళితుల భూములు పరిశీలించిన ప్రజాసంఘాలు
పెత్తందార్లకు కొమ్ము కాస్తున్న అధికారులు
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వెంకట శివ
ఉద్యమాలకు కూడా వెనకాడమని హెచ్చరిక
ఎలక్షన్ కోడ్ ఉన్నా, ఆదివారం అయినా అగ్రవర్ణాల సేవలో రెవెన్యూ, పోలీసులు
కడప సిటీ:
తమ పూర్వీకుల నుంచి మా అనుభవం లో ఉన్న భూముల జోలికొస్తేఖబడ్దార్అనిసిద్ధవటం మండలంకడపాయపల్లిదళితులుఅధికారులనుహెచ్చరించారు.దౌర్జన్యంగా 55 కుటుంబాలకు చెందిన భూములనుఅగ్రవర్ణాల వారికిఅప్పగించేందుకుసిద్ధవటంరెవిన్యూఅధికారులు,పోలీసులుఅత్యుత్సాహంచూపిస్తున్నారని మండిపడ్డారు.తమ భూములుతమకుఅప్పగించకుంటే ఆత్మహత్యలేశరణ్యమని వాపోయారు.సోమవారంసిద్ధవటంమండలంలింగంపల్లిపొలంలోనిసర్వేనెంబర్లు126,127/2,141/2 లోని 16.11ఎకరాలను లబ్దిదారులతోకలిసిసిపిఐ,దళిత హక్కుల పోరాటసమితి,ఏపి మహిళా సమైక్య, వ్యవసాయ కార్మికసంఘం,గిరిజనసంఘం,ఏఐవైఎఫ్ నాయకులు పరిశీలించారు .ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎన్.వెంకట శివ మాట్లాడుతూ 16.11 ఎకరాల భూమిని కడపాయపల్లి దళితులు 50 సంవత్సరాలుగాసాగుచేసుకుంటున్నారని తెలిపారు.తదుపరి వారి వారసులు ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు.ఈ భూమి ధరలకు రెక్కలురావడం తోఅగ్రవర్ణాలకన్నుపడిందన్నారు.నిరుపేదదళితులభూములను రక్షించాల్సిన సిద్ధవటం మండల రెవెన్యూ అధికారులు, పోలీసులు కబ్జాదారుల కు వత్తాసుపలకడందుర్మార్గమన్నారు.కడప కు చెందిన వారికి ఇక్కడిభూమిపైహక్కుఎక్కడిదని ప్రశ్నించారు.దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కె.మునెయ్య మాట్లాడుతూ ఎంతో కష్టపడి 50 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న దళితుల భూముల్లోదిగికంచెపాతిచేందుకు అధికారులు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారని నిలదీశారు.ఒక వైపు ఎలక్షన్ కోడ్ ఉన్నా, ఆదివారంఅయినా సరే అధికారులు ఈ భూమి వద్దకురావడంతగదన్నారు.దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలనిడిమాండ్చేశారు.తహశీల్దార్ 25ఏళ్ళుఅనుభవం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు.కడపాయ పల్లి కి చెందినబాధితురాలుజడ.నర్సమ్మమాట్లాడుతూతమభూములు తమకు దక్కకుండా చేస్తే ఆత్మహత్య లే శరణ్యమని వాపోయారు.అనంతరం జెండా అంజయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ఆర్డీవోతమకున్యాయం చేయాలనికోరారు.ఈకార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘంజిల్లాఉపప్రధానకార్యదర్శిపిమల్లికార్జున,గిరిజనసమాఖ్య జిల్లా అధ్యక్షుడు బ్రహ్మం, మహిళాసమాఖ్యజిల్లానాయకురాలు భాగ్యలక్ష్మి, ఏఐవైఎఫ్ నాయకులు నాగార్జున, సిపిఐ నాయకులు ఓబుళయ్య,పెద్ద ఎత్తునకడపాయపల్లిదళితులు, మహిళలుపాల్గొన్నారు.తెలుగు దేశం పార్టీ కడప జిల్లాకార్యదర్శి బి.హరి ప్రసాద్ఫోన్లోదళితులకు సంఘీభావంభావంప్రకటించారు.దళితులకు అండగాఉంటానని తెలిపారు.అలాగేసిపిఎంఅనుబంధంవ్యవసాయకార్మికసఘం జిల్లాప్రధానకార్యదర్శివి.అన్వేష్, సిద్ధవటం మండల కార్యదర్శి పి.సురేష్ బాబు దళితులను పరామర్శించి,తమపూర్తిమద్దతు ఉంటుందని కడపాయ పల్లి దళితులు భరోసా ఇచ్చారు.