వేంపల్లె
పారిశ్రామిక రంగానికి ఐటిఐ విద్యార్థుల అవశ్యకత ఎంతో ఉందని వేంపల్లె కందుల ఓబుల్ రెడ్డి ఐటిఐ ప్రిన్సిపాల్ ప్రసాద్ రావు అన్నారు. సోమవారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థి పదోవ తరగతి పూర్తి చేసిన వెంటనే ఐటిఐ విద్యను అభ్యసించితే ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నట్లు చెప్పారు. మిగిలిన కోర్సుల కంటే ఐటిఐ అభ్యర్థులకే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందే కొద్ది ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడుతున్నట్లు చెప్పారు. ఐటిఐ చదివిన విద్యార్థులకు ప్రారంభంలోనే 16 వేల రూపాయలు జీతంతో పరిశ్రమలు తీసుకొంటున్నట్లు చెప్పారు. ఇతర రంగానికి ఇంతటి అవకాశం లేదన్నారు. ఐటిఐ అభ్యర్థులు పని చేయడానికి సిద్దపడితే తిరుపతి, బెంగళూరు, చెన్నై, శ్రీసీటితో పాటు జిల్లాలో పరిశ్రమలు కూడ అభ్యర్థులను తీసుకొంటున్నట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ కంపెనీలు ఐటిఐ విద్యార్థులు కావాలంటూ తమను సంప్రదిస్తున్ననట్లు చెప్పారు. చాల మంది విద్యార్థులు ఇంటర్ చదివి పాస్, లేదా ఫైయిల్ అయిన తర్వాత చేరుతున్నట్లు చెప్పారు. దానికి బదులుగా పదోతరగతి పూర్తి అయిన వెంటనే ఐటిఐలో చేరి సర్టిఫికెట్లు పోందితే రెండు సంవత్సరాల కాలం వృధా కాదు అన్నారు. ఐటిఐలో అడ్మిషన్లు పక్రియ ప్రారంభం అయ్యిందని చెప్పారు. ఉత్సహవంతులైన విద్యార్థులకు ఫారిన్ లో కూడ ఎక్కువ జీతంతో ఉపాధి అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. తక్కువ ఖర్చుతో చిన్న వయస్సులో ఉద్యోగ అర్హత కలిగే చదువులు ఐటిఐ విద్య అన్నారు. తల్లిదండ్రులు కూడ విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఐటిఐ ప్రాధాన్యతను గూర్తించాలని కోరారు. ఉపాధి అవకాశాల వివరాలకు, అడ్మిషన్లు వివరాలకు తమను సంప్రదించాలని కోరారు.