ఈ దౌర్భాగ్యం చూడటానికి.. సొంత డబ్బాకొట్టించుకోవడానికేన ఈ కళా సంస్థలు..
కళాకారుల సొమ్ముతో సన్మానాల
చీ ..చీ.. చీ…ఇదేమి చోద్యం రా నాయన
పేద కళాకారుల పొట్టకొట్టడమే వీరి పని…
కీర్తి కోసమేనా ఈ కక్కుర్తీ… కాసుల కోసమా…
ఇక్కడ మారుతోంది ఎవరి జీవితాలు
కక్కుర్తి పనులు చేస్తూ కారుకూతలు కూయడమేల
ఇలా సొంత డబ్బాకొసమేనా..డబ్బుకోసమా కళ అనే నాటకాలు…
అందుకోసమేనా అంతా నాదేననే అహం…
కళామతల్లి ముసుగులో ఇన్ని కుట్రలా…
అరే గానమంటే ఇలా చిన్న చూపా…
గానం,గాత్రం లేకపోయిన గాండ్రింపు చేస్తే…
ఆ కారుకూతలు, కుట్రలకు బయపడలా…
సత్తాతో పనిలేదు.. సన్మానాలకోసమే చస్తున్నారంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ గాయని…
విజయవాడ:
కళారంగాన్ని ఈ విధంగా కించపరిచేదెవరు. పాటలపేరుతో పాడుపనులు చేస్తున్నా ప్రశ్నించే వారు లేకపోవడమే పేద కళాకారులకి,అసలైన గాయనీ గాయకులకు అవమానాలు ఎదురవుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎంతో మంది గాయనీ గాయకులు గ్రంధాలయం,కౌతాళం లో కళాసంస్థల ముసుగులో జరుగుతున్న దుశ్చర్యలపై తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.మితిమీరిన అహంకారం, గాయనీ గాయకులంటే చిన్నచూపు తో పాటు కేవలం వ్యక్తిగత భజనకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేరు వెల్లడించడానికి,పేరు వెల్లడిస్తే కళాసంస్థల ముసుగులో పెత్తందారీ వ్యవస్థ ను నడుపుతున్న కొన్ని కళాసంస్థల అధినేతల సూటీ పోటీ మాటలు ఇంకా పలురకాల తలనొప్పి మాటలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కళారంగాన్ని అడ్డుపెట్టుకొని అనేక రకాలుగా లాభపడుతూ పెద్దల పేరు చెప్పి వసూళ్లు చేసుకుని మళ్లీ తామే అస్తుల అమ్ముకుంటున్నామని, అప్పుల పాలు అవుతున్నామని నిస్సిగ్గుగా ఊకదంపుడు ప్రసంగాలు చేసే వారిపై పేదలను కించపరుస్తూ పెద్దల ముసుగులో చేస్తున్న పెత్తందారీ వ్యవస్థపై ప్రజాభూమి,pbtv నిరంతర పోరాటం చేస్తోంది.ఈ నేపధ్యంలో ఎంతోకాలంగా కళాసంస్థల పేరుతో కొంతమంది చేస్తున్న తప్పిదాలు,అధినేతలమనే అహంభావంతో ప్రవర్తిస్తున్న తీరుతో విసిగి వేసారి పోయిన కళామతల్లి బిడ్డలు ఒక్కొక్కరు తమకు ఎదురైన, ఎదురవుతున్న సంఘటనలు ప్రజాభూమి కి వివరిస్తూ ఉంటే ఇదేమి దౌర్భాగ్యమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే ఇందుకేనా కళామతల్లి ఇంకా జీవించి ఉండేది.. జీవించి ఉన్నా ఈ సంస్థల తీరు చూసి బ్రతికి బట్టకడుతుందా అనే ఆవేదన చెందుతున్నారు పేద కళాకారులు.