Thursday, November 28, 2024

Creating liberating content

హెల్త్ఎండిన నిమ్మకాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు !

ఎండిన నిమ్మకాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు !

నిమ్మకాయలో అధిక శాతం విటమిన్ సి ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతారు. అయితే నిమ్మ రసం తీసుకోవడం వల్ల అలసట, నీరసం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే నిమ్మకాయలు వేసవి కాలంలో ఎక్కువ ధర పలుకుతుంది. దీని వల్ల ఎక్కువగా నిమ్మకాయలను ఒక్కసారి తీసుకుంటారు. కానీ ఇవి చాలా తర్వాత ఎండిపోతాయి. ఈ ఎండి పోయిన నిమ్మకాయలను బయట పడేస్తారు చాలామంది. కానీ నిపుణులు ప్రకారం ఎండిన నిమ్మకాయలలో అనేక లాభాలు ఉన్నాయి. ఈ ఎండిన నిమ్మకాయలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, చక్కెర, ఫైబర్, కొవ్వు, ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. ఎండిన నిమ్మకాయల్లో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆంక్సిడెంట్ ఆర్గానిక్ ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలో ఉండే కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఎండిన నిమ్మకాయ పొడి తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి బయట పడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎండిన నిమ్మకాయలను వంటల్లో కూడా వాడతారు కొంతమంది. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఎండిన నిమ్మకాయ తీసుకోవడం వల్ల అలసట, నీరసం వంటి సమస్యలు తగ్గుతాయి. నిమ్మకాయలో విటమిన్‌ సి అధికంగా లభించడం వల్ల చర్మ రోగ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. లో బీపీ ఉన్నవారు ఎండిన నిమ్మకాయను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ఈ ఎండిన నిమ్మకాయను టీ గా ఉపయోగించవచ్చు.దీని వల్ల సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు ఈ నిమ్మకాయ ను తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. చేపలు, సూప్‌లు, కూరగాయల్లో ఈ ఎండిన నిమ్మకాయను వాడతారు.ఎండిన నిమ్మకాయ ముక్కల్ని నీరు, ఐస్ లేదా వేడి టీలో కూడా వాడతారు. మలబద్దం వంటి సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే ఈ నిమ్మకాయను ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఎండిన నిమ్మకాయను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్య బారిన పడకుండా ఉండాలి అంటే ఈ ఎండిన నిమ్మకాయను తప్పకుండా తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article