Sunday, April 20, 2025

Creating liberating content

తాజా వార్తలుమైసన్నగూడెం కార్తీకవన సమారాధనలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి

మైసన్నగూడెం కార్తీకవన సమారాధనలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి

ప్రముఖ సినీగేయ రచయిత అనంత శ్రీరామ్
ప్రజా భూమి, జీలుగుమిల్లి/జంగారెడ్డిగూడెం

కార్తీక వన సమారాధనలు సమైక్యతకు దోహదపడతాయని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కుర్రు నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక పామాయిల్ తోటల్లో బుధవారం కార్తీక వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గారపాటి సీతారామాంజనేయ చౌదరి,ప్రముఖ సినీగేయ రచయిత అనంతశ్రీరామ్ వనభోజనాలను ప్రారంభించారు. అనంతరం మూడు వందల మంది పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ యాంత్రిక జీవనంలో కార్తీకమాసం కొత్త శోభను తీసుకువస్తుందని, ఆత్మీయులందరూ ఒకచోట చేరడం వలన బంధాలు, బాంధవ్యాలు బలపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిషోర్, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షుడు పారేపల్లి సత్యనారాయణ, అర్జున మురళి, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ వనభోజనాల్లో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article