Thursday, November 28, 2024

Creating liberating content

క్రీడలుఐపీఎల్‌కి వీడ్కోలు పలికిన దినేశ్ కార్తీక్

ఐపీఎల్‌కి వీడ్కోలు పలికిన దినేశ్ కార్తీక్

టీమిండియా మాజీ బ్యాటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌ కెరియర్‌ ముగిసింది. బుధవారం రాత్రి జరిగిన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడంతో ఐపీఎల్‌కు కార్తీక్ వీడ్కోలు పలికినట్టయ్యింది. ఐపీఎల్ 17వ ఎడిషన్‌‌ (ప్రస్తుత ఏడాది) తనకు చివరిదని ఇదివరకే కార్తీక్ ధ్రువీకరించారు. దీంతో రాజస్థాన్ చేతిలో ఓటమి అనంతరం చెమర్చిన కళ్లు, భారమైన హృదయంతో అతడు కనిపించాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న సమయంలో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని కార్తీక్ ఆశించాడు. కానీ అతడి కలలు నెరవేరలేదు. బుధవారం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో టోర్నీ నుంచి ఆర్సీబీ నిష్క్రమించింది. దీంతో మ్యాచ్ అనంతరం సహచర ఆటగాళ్లు దినేశ్ కార్తీక్ వద్దకు వెళ్లి హత్తుకోవడం కనిపించింది. ఇన్నాళ్లు అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపారు. ఇక మైదానంలోని అభిమానులు డీకే.. డీకే అంటూ నినాదాలు చేశారు. ప్రత్యర్థి జట్టు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు కూడా అతనిని ఆప్యాయంగా హత్తుకొని అభినందనలు తెలిపారు. భారమైన హృదయంతో అభిమానులకు అభివాదం చేస్తూ దినేశ్ ఆర్సీబీ డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లాడు. మైదానం వీడుతున్న సమయంలో దినేశ్ కార్తీక్‌కు ఆర్సీబీ ఆటగాళ్లు ‘ఆనర్ ఆఫ్ గార్డ్స్’ ఇచ్చారు.ఇక దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కెరియర్ విషయానికి వస్తే, మొత్తం 257 మ్యాచ్‌లు ఆడి 4842 పరుగులు సాధించాడు. 2008లో తొలిసారి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చివరిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు.కాగా ఐపీఎల్ కెరీర్ చివరి మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 13 బంతులు ఎదుర్కొని 11 పరుగులు మాత్రమే కొట్టాడు. వివాదాస్పద ఎల్‌బీడబ్ల్యూ రూపంలో అతడికి లైఫ్ లభించినప్పటికీ ఆకట్టుకోలేకపోయాడు. అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు. అయితే చివరి మ్యాచ్‌లో కీపింగ్‌తో కార్తీక్ అదరగొట్టాడు. ఒక అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పాటు కళ్లు చెదిరే రీతిలో సంజు శాంసన్‌ను స్టంపింగ్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article