Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగం లో కొనసాగే వరకు పోరు

ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగం లో కొనసాగే వరకు పోరు

ఉక్కు నగరం :విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద 1200 రోజు జరుగుతున్న రిలే నిరాహారదీక్ష శిబిరంలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ (సిఐటియు), విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
వీరిని ఉద్దేశించి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లోని బిజెపి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100% వ్యూహాత్మక అమ్మకం ప్రకటించిన దగ్గర నుంచి నేటికీ 1200 రోజులు పూర్తయిందని ఆయన అన్నారు. ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేసినప్పటికీ మన ఉద్యమం ద్వారా వాటిని నిలువరించే ప్రయత్నాలో జరిగే ఉద్యమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన మరొకసారి స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలోకి ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ దీనిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ నేడు ఎదుర్కొంటున్న సమస్యలకు స్థానిక యాజమాన్యం మరియు కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ప్రధాన కారణమని వారు తీవ్రంగా విమర్శించారు. స్థానిక యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలపై కాగ్ నివేదికలు తప్పు పట్టిన కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. దీని ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల సరఫరాకు గల ఒప్పందాలను తుంగలో తొక్కి ఏకపక్ష నిర్ణయాల ద్వారా నష్టాలోకి దీన్ని నేడుతున్నారని వారు అన్నారు. కనుక దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు.
నేటి దీక్షా శిబిరంలో స్టీల్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ, శ్రీనివాస్, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ఎన్ రామారావు, కెఎస్ఎన్, కె. రాజబాబు, నీరుకొండ రామచంద్రరావు, యు రామస్వామి, వైటి దాస్, విళ్ళ రామ్మోహన్ కుమార్, బొడ్డు పైడిరాజు, శ్రీనివాసులు నాయుడు, నమ్మి సింహాద్రి, గుమ్మడి నరేంద్ర, శ్రీనివాస్, పుల్లారావు తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు విశ్రాంతి ఉద్యోగులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article