Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుఒకే సారి పవన్‌ ఎంతమందితో సంసారం చేయగలడు..?

ఒకే సారి పవన్‌ ఎంతమందితో సంసారం చేయగలడు..?

సజ్జల రామకృష్ణారెడ్డి

వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో ఏం మాట్లాడారంటే:

వయసు ముఖ్యం కాదన్న వారు ఇప్పుడు ప్రాణాంతకం అంటున్నారు:

  • చంద్రబాబుకి ఆనారోగ్యం రీత్యా తాత్కాలికంగా కోర్టు కండీషనల్ మెడికల్‌ బెయిల్‌ ఇచ్చింది. మరోవైపు ప్రధాన బెయిల్‌పై కూడా వాదనలు నడుస్తున్నాయి. మరింత కాలం ఆయన బయట ఉండటానికి వీలుగా ఒక మెడికల్‌ రిపోర్ట్‌ ఇచ్చినట్లు అర్ధం అవుతోంది.
  • ఎవరైనా జబ్బుతో ఉన్నప్పుడు కోర్టును ఆశ్రయించడం వారి హక్కు. కోర్టు స్పెషలిస్టు వైద్యులు ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసుకోవడం సహజం. దానిలో తప్పు లేదు.
  • ఎవరైనా ఒక వ్యక్తి ఆరోగ్య పరమైన సమస్యలతో ఉన్నప్పుడు కామెంట్‌ చేయడం కూడా సరికాదు. వాటిని నేను ఖచ్చితంగా పాటించే వ్యక్తిగానే మాట్లాడుతున్నాను.
  • కానీ సమస్య ఎక్కడొస్తుందంటే.. ఇప్పటివరకూ మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలా వ్యవహరిస్తూ…రిపోర్టులు మాత్రం వేరే విధంగా ఉంటే అనేక అనుమానాలు వస్తాయి.
  • ఒక పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉండి, ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సిన వ్యక్తిగా, సీఎంగా పనిచేసిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఎవరైనా అన్నీ సునిశితంగా పరిశీలిస్తారు.
  • అంతకు ముందువరకూ చంద్రబాబుకు వయసుతో పనిలేదు. ఆయన నవ యువకుడు అని మాట్లాడిన వ్యక్తులు… ఇప్పుడు మాత్రం చర్మవ్యాధులు కూడా ప్రాణాంతకం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
  • అయినా కోర్టు మానవత్వంతో మధ్యంతర బెయిల్‌ ఇచ్చి నీకు ఇష్టం వచ్చిన వైద్యునితో వైద్యం చేయించుకోమని చెప్పింది. ఆయన జైల్లో నుంచి బయటకు రాగానే 14 గంటలకు పైగా ప్రయాణం చేసుకుంటూ…కార్యకర్తలు వచ్చే వరకూ వెయిట్‌ చేసి మరీ మరుసటి రోజు ఉదయం గమ్యానికి చేరాడు. కరకట్ట నుంచి నేరుగా హైదరాబాద్‌ వెళ్లారు. ఇవన్నీ చూస్తే కామెంట్‌ చేయకతప్పడం లేదు. ఇప్పుడేమో, అక్కడ రాజకీయ భేటీలు నిర్వహిస్తున్నారు.

డాక్టర్లా…లేక పొలిటికల్‌ డాక్టర్లా..?:

  • జైల్లో ఉన్నప్పుడు.. కంటికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్ చేయకపోతే కళ్లు పోతాయి అన్నట్లుగా, చర్మవ్యాధులకు చికిత్స చేయకపోతే గుండె ఆగిపోతుంది.. అన్నట్లుగా వ్యవహరించి హైదరాబాద్‌ వెళ్లారు.
  • ఏఐజీ ఆస్పత్రి వారు ఆయన ప్రజాజీవితాన్ని పరిగణలోకి తీసుకుని ఆయన వెంట గుండె జబ్బులకు సంబంధించిన అంబులెన్స్‌ 24×7 ఉండాలని నివేదిక ఇచ్చారు.
  • దాన్ని చూస్తే వీళ్లు అసలు వైద్యులా…లేక పొలిటికల్‌ డాక్టర్లా అనే ప్రశ్న ఉత్పన్నమువుతుంది.
  • చికిత్స కోసం ఓ పేషెంట్‌ వస్తే…ఆయన ఎక్కడకు పోతే అక్కడకు ఒక అంబులెన్స్‌ ఉండాలని విచిత్రమైన నివేదిక ఇచ్చారంటే ఎవరికైనా ఏం అర్ధం అవుతోంది..?
  • ఇక ఆయన గుండెకు సంబంధించిన నివేదికను చూస్తే…నాకు తెలిసిన కార్డియాలజిస్టును అడిగితే.. ఆ నివేదిక ప్రకారం వెంటనే స్టంట్‌ వేయాలి..లేకపోతే ఆస్పత్రిలో చేర్చి పర్యవేక్షించాలని చెప్పారు. స్టంట్, బైపాస్‌ అనేది డిసైడ్‌ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నట్లు డాక్టర్లు ఆ నివేదిక ఇచ్చారు.
  • చర్మవ్యాధుల నివేదికను చూస్తే క్యాన్సర్‌ వచ్చే పరిస్థితి ఉందని, రిపోర్ట్స్‌ రావాల్సి ఉందని రాశారు. ఆయన హిస్టరీలో క్యాన్సర్‌ పరిస్థితి ఉంటే ముందే తేలాలి..కానీ అకస్మాత్తుగా ఇప్పుడు బయటకు వచ్చింది. వీళ్లు చూపే నివేదికలను చూస్తే ఇమిడియట్‌గా ఆస్పత్రిలో చేర్చి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. అంత సీరియస్ గానే ఉంటే.. వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలి అని నివేదిక ఇవ్వొచ్చు.
  • కానీ పబ్లిక్‌ లైఫ్‌లో ఉన్నాడు కాబట్టి ఈయన ఎక్కడికంటే అక్కడికి అంబులెన్స్‌ పెట్టుకుని తిరగొచ్చు అని నివేదిక ఇవ్వడం విచిత్రంగా ఉంది.
  • క్యాన్సర్‌ ఉందో లేదో తేల్చడం కోసం మరిన్ని పరీక్షలు చేయాలంటే .. సింప్టమ్స్‌ ఉంటే రూల్‌ అవుట్‌ చేయడం వేరు…ఉన్నాయేమో పరీక్షలు చేయాలి అని చెప్పడం కూడా చిత్రంగా ఉంది.

ఆ రిపోర్టు చంద్రబాబు చాకచక్యమా.. డాక్టర్లు పరిధి దాటారా?:

  • అందరికీ జబ్బులు వస్తుంటాయి. పైగా జైళ్లో ఉన్న వాళ్లకు, 70 ఏళ్లు పైబడిన వారికి అందరికీ సమస్యలు వస్తుంటాయి. అందరికీ టెస్టులు చేసి ఇలానే నివేదికలు వస్తుంటాయా..? అలానే పంపిస్తుంటారా?
    అలాంటి నివేదికలు తెచ్చుకోవడం చంద్రబాబు చాకచక్యమా..? లేక డాక్టర్లు తమ పరిధి దాటి నివేదికలు ఇచ్చారా? . దీంట్లో మేనేజ్‌మెంట్‌ కనిపిస్తోంది. అది మా తప్పా..? అది నివేదికలోనే కనిపిస్తోంది.
  • కంటి విషయంలోనూ అంతే…కంటి పరీక్షలు చేయించుకున్న వారు ఐదు వారాలు రెస్ట్‌లో ఉండాలి అంటారు. మరి చాలా మందికి కంటి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి…ఐడ్రాప్స్‌ ఇస్తుంటారు..వేసుకుంటారు.
  • కంటి చికిత్స చేయించుకోవడానికి ఇచ్చిన బెయిల్‌ను డాక్టర్లే పబ్లిక్‌ లైఫ్‌లో అంబులెన్స్‌లో తిరగాలి అని నివేదిక ఇవ్వడం విచిత్రంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి తనకు తాను తెచ్చుకున్నాడు.
  • నాకు శక్తి తగ్గలేదని ఓ పక్క చెప్పుకుంటూ..మరో పక్క ఇప్పుడు సర్జరీ చేయకపోతే మనిషి ఉంటాడా.. పోతాడా అనే విధంగా నివేదికలు తెప్పించుకుంటున్నాడు. అదే నిజమే అయితే ఆయన ఇమిడియట్‌గా ఆస్పత్రిలో బెడ్‌ మీద ఉండాలి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్ధిస్తాం.
  • ఆయన జైళ్లో ఉండాలని మేమేం కోరుకోవడం లేదు. ఆయన పబ్లిక్‌ లైఫ్‌లో ఉండాలి. ఆయన పబ్లిక్‌ లైఫ్‌ను ఫేస్‌ చేయాలి..ఆయన చేసిన మోసాలకు సంజాయిషీ ఇచ్చుకోవాలి. ఆయన లోపల ఉండటం వల్ల మాకొచ్చే లాభం ఏమీలేదు…
  • ఈ మొత్తం వ్యవహారంలో అసలు చేసిన స్కాం పక్కకు పోతోంది.
  • మొన్నటివరకూ జైల్లో దోమలని, ఆయన ఆరోగ్యం అని, సింపతీ గేమ్‌ మొదలు పెట్టారు.
  • ఎక్కడా కూడా ఈ స్కాం.. నేను చేయలేదని ప్రూవ్‌ చేసే ప్రయత్నాలు చేయడం లేదు. ఇకొంచెం కాలం ఎలా బెయిల్‌ తెచ్చుకోవాలి అనేదే వారు చేస్తున్న ప్రయత్నం.

బాబుకో న్యాయం..జైళ్లో ఉన్న ఖైదీలకో న్యాయమా?:

  • ఇవన్నీ చూస్తుంటే.. చంద్రబాబుకో న్యాయం.. జైల్లో ఉన్న ఖైదీలకు ఒక న్యాయమా?. మిగతావాళ్లకు లేని పరిష్కారం మరొకరికి ఎందుకుంటుందో అర్ధం కావడం లేదు.
  • రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు నివేదికలు క్రియేట్‌ చేసే ప్రయత్నం జరుగుతోంది. అందుకే మెడికల్‌ బోర్డు పెట్టాలి.
  • వీళ్లు ఆరోపిస్తున్నట్లు వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి కి మెడికల్‌ బోర్డు ఇచ్చిన నివేదిక ప్రకారం బెయిల్‌ ఇచ్చింది.ఆయన మూమెంట్‌పై కూడా కండిషన్స్‌ పెట్టి ఇళ్లు, ఆస్పత్రి తప్ప ఎక్కడకు వెళ్లరాదని నిబంధనలు పెట్టింది.
  • కానీ హైకోర్టు ఉదారంగా మీ రెగ్యులర్‌ డాక్టర్లతో వైద్యం చేయించుకోండి అంటే దాన్ని దుర్వినియోగం చేశారు. మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేసి పరిమితులు విధించి అనుమతి ఇస్తేనే మెడికల్‌ బెయిల్‌కి ఒక అర్ధం ఉంటుంది.

మేనిఫెస్టో అంటే నిర్వచనం తెలుసా..?:

  • టీడీపీ, జనసేనలు మేనిఫెస్టో అంటూ కొత్త నాటకానికి తెరలేపారు. రెండు దేశాల అగ్రనాయకులు కూర్చుని చర్చించుకున్నట్లు రెండు గ్రూపుల మధ్య జెండాలు పెట్టుకుని డ్రామాలు వేస్తున్నారు.
  • రాష్ట్రాన్ని జగన్‌ గారి నుంచి విముక్తి చేయాలని చర్చించుకున్నాం అంటున్నారు. టీడీపీ ఇచ్చిన 6 హామీలకు మరో ఐదు జనసేన వాళ్ళు జతచేశారట. అసలు జనం చెవుల్లో పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్లు పెట్టాలని వీళ్లు ప్రయత్నం చేస్తున్నారు.
    -అసలు మేనిఫెస్టో అంటే నిర్వచనం ఏంటో కూడా వారికి తెలుసా..? అసలు టీడీపీ మేనిఫెస్టోకు ఉన్న విశ్వసనీయత ఎంత..?
    -తానిచ్చిన మేనిఫెస్టోను చివరకు వెబ్‌సైట్లో కనపడకుండా చేసిన ఘన చరిత్ర చంద్రబాబుకు ఉంది. మేనిఫెస్టోలో స్పష్టమైన హామీలు ఏమైనా ఉన్నాయా?
    -రాష్ట్ర ప్రజలంటే వీరికి ఎంత ఎగతాళి అయిందో మేనిఫెస్టో పేరుతో వారి డ్రామాలను చూస్తే అర్ధం అవుతోంది.
    -మరోపక్క ఆలూ.. చూలు లేకుండానే రెండు పార్టీల వారు కొట్టుకుంటన్నారు. అసలు మేనిఫెస్టోలో ఆ సీరియస్‌నెస్‌ లేదు. ఆ రెండు పార్టీల సమైఖ్య భేటీలో కొట్లాడుకోవడం రోజూ పరిపాటిగా మారింది.

ఒకే సారి ఎంతమందితో పవన్ సంసారం చేయగలడు..?:

  • ఎన్నికలు జరుగుతున్న పక్క రాష్ట్రంలో మరో డ్రామా నడుస్తోంది. ఇక్కడేమో టీడీపీ, జనసేన పొత్తు ఒక డ్రామా అయితే అక్కడ మాత్రం బీజేపీ, జనసేన పొత్తు.
  • టీడీపీ మేం పోటీలో లేమంటూనే కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతూ ఓపెన్‌గానే తిరుగుతున్నారు. ఇక్కడ పొత్తు కుదిరినప్పుడు అక్కడెందుకు కుదర్లేదు..?
  • ఇక్కడ టీడీపీతో ఉన్న వాడు అక్కడ బీజేపీతో ఎలా వెళ్లాడు..? – ఒకే సారి ఎంతమందితో సంసారం చేయగలడు..?
  • మరో వైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు ఎజెండా ఎత్తుకుని తిరుగుతున్నారు. ఈ మొత్తం రాజకీయ ముఖచిత్రంలో చంద్రబాబు మనుషులే కనిపిస్తున్నారు.
  • బీజేపీలో పురంధేశ్వరి, జనసేన నాదెండ్ల మనోహర్‌లు మాత్రమే కనిపిస్తున్నారు. తెలంగాణలో సీట్లు తీసుకున్న పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఎక్కడా తిరగడం లేదు.
  • పవన్‌ కల్యాణ్, చంద్రబాబులకు నిజంగా ఏపీపై చిత్తశుద్ధి ఉంటే వారు వ్యవహరించే తీరు ఇదేనా?
  • మేం మోసం చేసినా మీరు ఏం చేయలేరు…ఆ సత్తా మాకుంది అనే రీతిలో బరితెగింపుతో వెళ్తున్నారు. వారికి ప్రజలపై ప్రేమ, అభిమానం కనిపిస్తుందా..?
  • ఒక రాజకీయ పార్టీ ప్రజల్ని ఇంతగా కన్ఫ్యూజ్‌ చేయవచ్చా?
    పదేళ్ల నుంచి వైఎస్సార్సీపీ చూపిస్తున్న సీరియస్‌ నెస్‌ వాళ్లలో కనిపించడం లేదు. వీధి నాటకాలు వేసుకుంటూ ప్రజలకు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారు.
  • చంద్రబాబు స్కాం చేశాడంటే దానికి సమాధానం చెప్పడు. నా మీడియా నాకుంది..నా వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ నాకున్నాయి అంటూ చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు.
  • నా పెత్తందార్ల గ్రూపు నాకుంది..దేశం మొత్తం చక్రం తిప్పగల హేమాహేమీలు నాతో ఉన్నారు..ఇక జనంతో ఏం పని అనే బరితెగింపు చంద్రబాబులో కనిపిస్తోంది.
  • దీనిలో ఆయన సూత్రధారుడైతే…పురంధేశ్వరి, పవన్‌కల్యాణ్‌లు పాత్రధారులు.
  • ప్రధానంగా చంద్రబాబులో కనిపించే.. నేను ఏదైనా చేయగలను అనే అహంకారం చాలా ప్రమాదకరం.

సాధికారత పొందిన వర్గాలు నిర్వహించుకుంటున్న సభలు అవి:

  • మేం నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్రలకు అనూహ్య స్పందన వస్తోంది. నాలుగు గోడల మధ్య కూర్చుని వ్యూహాలు పన్నితే ప్రజల మనసు చూరగొనొచ్చు అనుకునే వారికి ఈ యాత్రలు కళ్లుతెరిపిస్తున్నాయి. ప్రజల్లో ఈ యాత్రలకు అపూర్వ స్పందన వస్తుంటే విషప్రచారానికి ఒడిగట్టారు. రాజకీయంగా చేసిన సభలు కాదు. సామాజిక న్యాయం సాధించే దిశగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక యజ్ఞం చేసి అందరినీ మెప్పించాం.
  • ఏ వర్గాలకైతే సాధికారత కల్పించామో వాళ్లు ముందుండి నిర్వహించుకుంటున్న యాత్రలు. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మాత్రమే జరుగుతున్న సభలు.
  • వాళ్లను వాళ్లు ప్రశ్నించుకోవాలి..వేషాలు, నాటకాలు వేస్తే కుదరదు. కాలం మారిపోయింది…ప్రజలను ఇప్పుడు కూడా మీరు మభ్యపెట్టలేరు.
  • చంద్రబాబు ఏనాడైనా ఒక నియోజకవర్గ స్థాయిలో ఇలాంటి సభలు జరపగలిగాడా?
  • లోకేశ్‌..తన పాదయాత్రలో పది నియోజకవర్గాల నుంచి జనాన్ని తెచ్చుకోకుండా జరిపారా?
  • ఇవి కేవలం అసెంబ్లీ స్థాయి సభలు..ఆ ఉత్సాహం, ఊపు ప్రజల్లోంచి వచ్చింది…జగన్‌ గారు కల్పించిన సాధికారత వల్ల వచ్చింది.
  • మా ప్రతినిధులను జగనన్న పక్కన కూర్చోబెట్టుకున్నాడని ఆయా వర్గాలు నిర్వహించుకుంటున్న సభలు. సామాజికంగా ఈ ప్రభుత్వంలో మాకు గొప్ప హోదా ఉందని వారు చాటిచెబుతున్నారు.
  • రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఇలానే ఉంటుంది…రాష్ట్రంలో 85 శాతం మంది జగన్‌ గారి పరిపాలన ఫలాలను పొందుతున్నారు.
  • అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం ఇవ్వాల్సినంత చేయూత ఇస్తూ మద్దతుగా నిలిచింది.

అలిపిరి నాడే కుదరని సింపతీ గేమ్‌ ఇప్పుడు కుదురుతుందా?:

  • చంద్రబాబుకు 75 ఏళ్ల వయసులో బడుగు బలహీన వర్గాల గురించి ఏనాడైనా ఆలోచించాడా?
  • ఆలిపిరి సంఘటన నిజంగా జరిగినా.. ఆ రోజు కూడా ఆయన ఇదే వేషం వేశాడు. నాలుగు నెలలు చేతికి కట్టుకుని కూర్చున్నాడు. రోజూ బస్సుల్లో జనాన్ని తరలించడం..చేతికట్టుతో వారికి దర్శనమివ్వడం తప్ప చేసిందేమీ లేదు.
  • ఓ పక్క రాజశేఖరరెడ్డి గారు పాదయాత్ర చేసి ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారని వాళ్ల వాళ్లే చెప్పారు. అప్పటికి ఇప్పటికీ తేడా ఒకటే…ఆనాడు ఎటాక్‌ నుంచి బయటపడ్డాడు.కానీ ఈనాడు స్కాంలో పూర్తిగా చిక్కాడు.
    సింపతీ అనేది అప్పుడే కుదరనది..ఇప్పుడు అసలు ఆ పప్పులు కుదరవు.
  • చంద్రబాబు…! నిజంగా నువ్వు నాయకుడివైతే…నీ సత్తా ఏంటో రుజువు చేసుకో.
  • 2014–19లో నువ్వు ప్రజల్ని మోసం చేశాడు…మేనిఫెస్టోనే కనిపించకుండా చేశాడు.
  • ఇప్పుడు నువ్విచ్చే మేనిఫెస్టో విడుదల చేయకముందే నీ గత చరిత్ర తెలిసిన వారు నీ మోసకారితనాన్ని గమనించారు.మీరు చెప్పే మేనిఫెస్టోకి, మాటలకు విలువ ఉండదు.
  • ఈ రోజు మేం రూ.2.40 లక్షల కోట్లు డీబీటీ అందించాం. అప్పుడు ఇప్పుడూ అదే బడ్జెట్‌.
  • మధ్యలో ఎక్కడా ఎవరూ లేరు..బటన్‌ నొక్కితే నేరుగా ప్రజల ఖాతాలకు వెళ్లింది.
  • ఇదే చంద్రబాబు హయాంలో ఎంత ప్రజలకు చేరి ఉంటుందో ఆలోచించండి. కింది స్థాయికి వెళ్లేసరికి, జన్మభూమి కమిటీలను దాటుకుని ప్రజలకు చేరే సరికి ఎంత చేరింది అనేది గమనించాలి.
  • అలాంటి మధ్యవర్తులు లేకుండా ధర్మకర్తల్లా ప్రజల సొమ్ము ప్రజలకు చేర్చాలనే తపన జగన్‌ గారిలో కనిపిస్తోంది.

మీడియా ప్రశ్నలు–సమాధానాలు:

– ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. పక్క రాష్ట్రాల్లో ఉన్న వారిని ప్రభావితం చేయడం, ఒకరికి ఓటు వేయమని చెప్పే బాధ్యత మేం తీసుకోం. అక్కడి ఓటర్లకు ఎవరు మేలు చేస్తారో తెలుసు…మేం కల్పించుకోవాల్సిన అవసరం లేదు.
– బాలకృష్ణ అనే వ్యక్తి ముందు 2014–19లో చేసిన పరిపాలన గురించి మాట్లాడాలి. చంద్రబాబుకు వియ్యంకుడిగా, ఆ పార్టీ నాయకుడిగా ప్రజలకు బాలకృష్ణ సమాధానం చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. పక్క రాష్ట్రం వాళ్లు ఏదో అన్నారని చెప్పడం వారి చేతకానితనం అవుతుంది.
– చంద్రబాబువి తప్పుడు నివేదిక అని నేను అనలేదు..వైద్యుడు చెప్పాల్సిన పరిధిని మించి చెప్పాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నా.

  • అసలు తిరగడానికి కాదు బెయిల్‌ ఇచ్చింది…ఉంటే ఆస్పత్రిలో ఉండాలి..లేదా ఇంట్లో ఉండాలి. ఆ రిపోర్టులు చంద్రబాబు బయట తిరగడానికి అనుకూలంగా ఉన్నాయని మేం పాయింట్‌ అవుట్‌ చేస్తున్నాం.
    – వరికపూడిశెల విషయంలో చంద్రబాబు చేసింది మోసం..ఆనాడు ఏ అనుమతులు లేకుండా చంద్రబాబు శంకుస్థాపనలు ఎలా చేశాడు..? జగన్‌ గారు అనుమతులన్నీ వచ్చాక శంకుస్థాపన చేశారు.. ఏది మోసమో ప్రజలే నిర్ణయిస్తారు. ఆనాడు ఎన్నికల ముందు ఏం ఆశించి చంద్రబాబు శంకుస్థాపన చేశాడు..? . ఎప్పుడు ఎన్నికలు వస్తున్నా.. ప్రాజెక్టులకు టక టకా నాలుగు టెంకాయలు కొట్టడం బాబుకు అలవాటు. చంద్రబాబులా అయితే మా నాయకుడు జగన్‌ గారు నాడు–నేడు కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలు పెట్టాలి. కానీ చెప్పినవి చేసి ప్రజల వద్దకు వెళ్లాలని కోరుకునే నాయకుడు జగన్‌ గారు.
    మమ్మల్ని ప్రశ్నించే ముందు వాళ్లు సమాధానం చెప్పుకోవాలి.
    – చంద్రబాబు ముందు సమాధానం చెప్పాల్సింది గత మేనిఫెస్టో ఏమయింది అనేది..
  • అప్పుడు ఏటా 12 సిలిండర్లు అన్నాడు..ఏమైంది..ఇప్పుడు మళ్లీ మూడు సిలిండర్లు అంటున్నాడు. నిరుద్యోగ భృతి ఏమైంది..? ఇవన్నీ అడుగుతారనేగా మేనిఫెస్టో మాయం చేసింది.?
    బాబు వస్తే జాబు అన్నాడు..అదే మాట మళ్లీ అంటున్నాడు.
    ఆ రోజు ఎందుకు చేయలేదో చెప్పి ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తే బాగుంటుంది. ఇవేవీ చెప్పకుండా.. మళ్ళీ ఆయన ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్‌ పెడుతున్నాడు… అని సజ్జల రామకృష్ణారెడ్డిగారు మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article