గండేపల్లి:గండేపల్లి మండలం మల్లేపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2011 వ సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం మల్లేపల్లి లో నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులంతా కలిసి వారి యొక్క యోగక్షేమములు అడిగి తెలుసుకున్నారు. పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం ఎంతో ఆనందదాయకంగా ఉందని, పూర్వపు విద్యార్థులు కలుసుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులు అంతా కలిసి ఉపాధ్యాయులను సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఆటపాటలతో రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,పూర్వ విద్యార్థులు, పాల్గొన్నారు.