అనంతపురము
“పారిశుద్ధ్యం వైపు ప్రతి చిన్న అడుగు.. దేశం కోసం పెద్ద మార్పును తీసుకువస్తుంది… మన పరిసరాలను శుభ్రం చేసి భారతదేశాన్ని కొత్తగా మార్చుకుందాం” అనే నినాదాలతో ఆదివారం ఉదయం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఈ ఎన్ టి వార్డు ముందు ఉన్న ప్రదేశంలో ఆస్పత్రి సిబ్బంది అందరూ కలిసికట్టుగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శ్రమదానం కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది 200 మంది పైగా పాల్గొని వ్యర్ధాలను అన్నిటిని తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. ఇలాంటి స్వచ్ఛభారత్ కార్యక్రమాలు మునుముందు కూడా ఎన్నో నిర్వహించి ఆసుపత్రిని శుభ్రపరచడంతో పాటు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుతూ ఆసుపత్రి యాజమాన్యం అందరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె. ఎస్.ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్ఎంవోలు డాక్టర్ హేమలత, డాక్టర్ పద్మజ, నర్సింగ్ సూపరింటెండెంట్ రజిని, ఐ సి ఎన్ సిబ్బంది శోభా, ప్రసన్న, నీలిమ, రేష్మ, శానిటరీ మేనేజర్ నూర్, సెక్యూరిటీ మేనేజర్ రసూల్, రాజశేఖర్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సిబ్బంది మొత్తం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.