హిందూపురం టౌన్
పట్టణంలో పేరుగాంచిన గుడ్డం రంగనాథ స్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుండే దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా స్వామి వారి మూలవిరాట్ విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలు ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి భక్తులు గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. మహా మంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపించారు.