- కలెక్టర్ మాధవీలత
ఓటు లేని వ్యక్తులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటరుగా నమోదు కు ముందుకు రావడం తో పాటు ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా కె.మాధవీలత పేర్కొన్నారు.శుక్రవారం ఉదయం స్థానిక వై జంక్షన్ వద్ద స్వీప్ – ఓటరు అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు . అనంతరం కియోస్కో ని ప్రారంభించి ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని, ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ ను పరిరక్షించడం జరుగుతోందని అన్నారు. స్వేచ్ఛాయుతం గా, పకడ్బందీగా ప్రపంచం లో ఏ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఎన్నికలు జరగవనడం లో ఎటువంటి సందేహం లేదు. అందుకు కారణం మన ఎన్నికల వ్యవస్థ అమలు చేస్తున్న విధి విధానాలు అని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అవ్వడం పారదర్శక విధానంలో రూపొందించిన ఓటరు జాబితా అని తెలియ చేశారు. ఓటుకు అర్హత కలిగి 18 ఏళ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరు గా నమోదు కావాలని పిలుపు నిచ్చారు. బి ఎల్ ఓ లు కూడా వారి పరిధిలో ఉన్న ప్రతి ఒక్క అర్హత కలిగిన ఓటరును ఓటరుగా నమోదు చేయడం కోసం పని చేయాల్సి ఉందన్నారు. మీ ఏరియా కు చెందిన బి ఎల్ వో ను కలుసుకుని ఓటరు జాబితాలో మీ పేరు నమోదు అయిందో లేదో సరి చూసుకోవాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఓటు లేకపోతే ఫారం 6 ద్వారా నమోదు కావాలని కోరారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తరచుగా ఇళ్ళు మారుతుంటారు, ఆ సమయంలో పాత చిరునామా నుంచి కొత్త చిరునామాకు ఓటును మార్చుకోవాలని స్పష్టం చేశారు. అటువంటి వారు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఓటరు జాబితా నుంచి పేరు తొలగింపు మరణించిన వారి కి చెంది ఫారం 8 ద్వారా దరఖాస్తు 7చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పారదర్శక త తో కూడిన ఓటరు జాబితా ఏర్పాటు చేసుకుని స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కోవడం మనందరి బాధ్యతగా పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ముఖ్యమైన ఎనిమిది కూడళ్లలో ” కియోస్కో ” లని ఏర్పాటు చేశామని, ఓటు హక్కు లేని వారు, మార్పులు చేర్పులు కోసం ధరకాస్తు చేసుకునే వారు, వారి ఓటు హక్కు ఉందో లేదో పరిశీలన చేసుకునే వారు ఈ కియోస్కో లను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.స్వీప్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పిలుపు నిచ్చారు. స్వచ్చలత తో కూడిన ఓటరు జాబితా రూపకల్పన ప్రజలు కూడా వారి సామాజిక బాధ్యత వహించాల్సి ఉందని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని, ప్రజాస్వామ్య వ్యవస్థ ను పరిరక్షించు కావాల్సి ఉంటుందన్నారు.ఓటు మన హక్కు.. ఓటు యొక్క విలువను తెలియ చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండడం మాత్రమే కాదు ఓటు ను వేయాల్సి ఉందన్నారు. ఓటు లేని వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావడం మాత్రమే కాదు చిరునామా మారినా, వేరొక చోటుకు, నియోజక వర్గాని మారినా కూడా ప్రస్తుతం నివాసం ఉన్న చోటుకు వారి ఓటును బదలీ చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, డిపివో జేవి సత్యనారాయణ, అదనపు కమిషనర్ పి ఎమ్ సత్య వేణి, జిల్లా అధికారులు, కాలేజీ, మునిసిపల్ స్కూల్ విద్యార్థులు, ఆర్ ఎం సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.