Friday, November 29, 2024

Creating liberating content

సినిమారొమాంటిక్ సీన్ చేసేటప్పుడు ఆ హీరో ప్యాంట్ లేకుండానే వచ్చాడు

రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు ఆ హీరో ప్యాంట్ లేకుండానే వచ్చాడు

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రియాంక చోప్రా చెల్లెలుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన పరిణీతి చోప్రా.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు హిట్ సినిమాల్లో నటించి బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్నారు. గతేడాది పరిణీతి చోప్రా వివాహం చేసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. పరిణీతి చోప్రా తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆమె బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. రణ్‌వీర్ సింగ్ సెట్స్‌లో విచిత్రంగా ప్రవర్తిస్తారని పరిణీతి చోప్రా చెప్పుకొచ్చారు. విచిత్రమైన డిజైన్‌లతో కూడిన డ్రెస్‌లతో దర్శనం ఇస్తారని..అడిగితే ఈ రోజు ఇదే ఫ్యాషన్ అని చెబుతారని రణ్‌వీర్ సింగ్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి పరిణీతి చోప్రా చెప్పుకొచ్చారు. అప్పుడప్పుడు సెట్‌లో ప్యాంటు వేసుకోకుండా వచ్చి పక్కన కూర్చునే వారని.. ప్యాంటు వేసుకోవచ్చు కదా అని ఎవరో చెబితే అప్పుడు ప్యాంటు వేసుకుని వచ్చేవాడు.ఇక రణ్‌వీర్ ఉన్న క్యారవాన్‌లోకి వెళ్లడానికి కూడా భయం వేసేదని..ఎందుకంటే ఆయన ఒంటిమీద బట్టలు లేకుండా ఉండేవారని పరిణీతి చోప్రా చెప్పుకొచ్చారు. ఒకసారి బట్టలు లేకుండా ఎందుకు తిరుగుతావు అని అడిగితే.. అలా చూడటం వల్ల మీ జీవితాలు మారవు కదా అని ఎదురు ప్రశ్నించాడని పరిణీతి తెలిపింది. ఒకసారి రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు ప్యాంట్ లేకుండానే సెట్‌లో కనిపించాడు. దీంతో నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పడంతో ప్యాంటు వేసుకుని వచ్చాడు అని చెప్పుకొచ్చింది.రణ్‌వీర్ సింగ్ గురించి పరిణీతి చోప్రా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article