Tuesday, April 22, 2025

Creating liberating content

తాజా వార్తలుసామాజిక సాధికార యాత్ర సక్సెస్ చేసి ఎమ్మెల్యే పర్వత అంటే ఏంటో చూపిస్తాం-ప్రత్తిపాడు వైస్సార్సీపీ శ్రేణులు

సామాజిక సాధికార యాత్ర సక్సెస్ చేసి ఎమ్మెల్యే పర్వత అంటే ఏంటో చూపిస్తాం-ప్రత్తిపాడు వైస్సార్సీపీ శ్రేణులు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు లయన్స్ క్లబ్ ఫంక్షన్ హాల్లో సర్పంచ్ గుడాల విజయలక్ష్మి వెంకటరత్నం అధ్యక్షతన ప్రత్తిపాడులో నవంబర్ 23 వ తేదీన ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే సంకల్పంతో వైస్సార్సీపీలో ఉన్న అన్ని వర్గాల నాయకులు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ గుడాల విజయలక్ష్మి వెంకటరత్నం,ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్,జడ్పీటీసీ బెహరా రాజరాజేశ్వరి దొరబాబు,ఎంపీటీసీలు పినిశెట్టి ప్రకాష్,సీంద్రిపు భాస్కరరావులు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి నాలుగున్నర ఏళ్లలో ప్రజలకు చేసిన మంచిని అన్ని కులాల రాష్ట్ర స్థాయి నాయకులు ఈ సభలో వివరిస్తారని తెలియచేసారు.ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పిలుపు మేరకు ప్రత్తిపాడు గ్రామ వైస్సార్సీపీ శ్రేణులు సమావేశమై బహిరంగ సభను విజయవంతం చేయడానికి భారీ జన సమీకరణ దిశగా ప్రణాళికలు రూపొందించికొన్నామని తెలియచేసారు.ఎమ్మెల్యే పర్వత నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైస్సార్సీపీ జెండా ఎగురవేయడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తామని వారన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సేరు కృష్ణ నాయకులు ఆకుల వీరబాబు,ఏడిద రెడ్డి నాయుడు,పత్రి రమణ,వాసా చిట్టిబాబు,ఏనుగుపల్లి శేఖర్,గోళ్ల జయశేఖర్,గానాల గంగాధర్, మోర్త విజయ్,నాని,తాతపూడి బుజ్జి, సచివాలయం కన్వీనర్లు,గృహ సారథులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article