Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుప్రజల ఆశీస్సులే జగనన్నకు శ్రీరామ రక్ష

ప్రజల ఆశీస్సులే జగనన్నకు శ్రీరామ రక్ష

కొత్తపేటలో సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొని ప్రసంగించిన ఎంపీ భరత్

కొత్తపేట (రాజమండ్రి), : మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీ అందరి ఆశీస్సులు, మద్దతు శ్రీరామ రక్ష అని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. మీ అందరి పరిపూర్ణమైన అభిమానమే జగనన్నకు వెయ్యి ఏనుగుల బలమన్నారు. గురువారం రాత్రి కోనసీమ జిల్లా కొత్తపేటలో వైఎస్సార్ సీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఎంపీ భరత్ అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే సీఎం జగన్ నిర్వహించి రికార్డు సృష్టించారన్నారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలకు లక్షల కోట్ల రూపాయలను కేటాయించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకు వెళుతున్నారని, ఆయనకు ప్రతీ ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. జగనన్న ఒక వ్యక్తి కాదని, మహాశక్తి అని..అది మీ అందరి చల్లని దీవెనల వల్ల లభించిందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తులో స్పష్టత కొరవడిందని, ప్రజలకు కూడా అధికారం కోసమే వీరిద్దరూ చేతులు కలిపారనేది అర్ధమైందన్నారు. జగనన్న ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థను వారు అధికారంలోకి వస్తే ఉంచుతారా, తీస్తారా చెప్పలేకపోతున్నారని..కారణం ఏమంటే ఏమవుతుందోననే భయం, వణుకు వారిని వెంటాడుతోందన్నారు. జగనన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేశారన్నారు. నాడు-నేడు ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చారన్నారు. అలాగే వైద్య రంగంలో కూడా ఎవరూ ఊహించని మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు..ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యా విధానం, మహిళల ఆర్థిక పరిపుష్టికి అనేక పథకాలు తీసుకొచ్చి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోయేలా సమర్థవంతమైన పాలనను జగనన్న అందజేశారన్నారు. అన్ని వర్గాల సంక్షేమమమే జగనన్న లక్ష్యమని ఎంపీ భరత్ తెలిపారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని మరోసారి 2024 ఎన్నికలలో వన్స్ మోర్ అంటూ గెలిపించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article