సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో లెక్కింపు సందర్భంగా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.సమస్యాత్మక ప్రాంతాలు, నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్టు చెప్పారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కౌంటింగ్ రోజున డ్రైడే అమలు చేస్తున్నామని, రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలను ప్రత్యేకంగా కేటాయించారని వివరించారు. పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లాలో రేకెత్తిన అల్లర్లను అదుపులోకి తెచ్చినట్టు మీనా వివరించారు.