రచయిత నాగరాజు
ప్రజాభూమి , కామవరపు కోట
గ్రామీణ ప్రాంతాలలో సైతం రచయితలను, కవులను ప్రోత్సహించాలని ఉపాధ్యాయులు, రచయిత పోరంకి నాగరాజు అన్నారు. 56వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక గ్రంథాలయం ఆవరణలో రచయితల సందేశాలు, సెమినార్లు, కవి సమ్మేళనం కార్యక్రమం పై హై స్కూల్ మరియు ఆదిత్య స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామవరపుకోట పూర్వపు విద్యార్థి పంచ పదుల సంకలనంలో కొంకేపూడి అనురాధ రచించిన మా ఊరి తంగేడు పూలు మరియు కొన్ని పుస్తకాలను గ్రంథాలయానికి నాగరాజు అందజేశారు. అనంతరం విద్యార్థులకు గ్రంథాలయాలు వాటి ఆవశ్యకత అనే అంశంపై గ్రంథ పాలకులు ఎం భీమరాజు ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచయిత, ఉపాధ్యాయులు పలివెల శివరామకృష్ణ, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ గౌరవ సలహాదారులు టీవీఎస్ రాజు, చైర్మన్ వీరమల్ల మధు, గ్రంథాలయ సహాయకురాలు సిహెచ్ వెంకటరమణ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.