Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుఫోన్ ట్యాపింగ్ కోసం 17 కంప్యూటర్లు… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నీ ధ్వంసం చేశాం: ప్రణీత్...

ఫోన్ ట్యాపింగ్ కోసం 17 కంప్యూటర్లు… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నీ ధ్వంసం చేశాం: ప్రణీత్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎప్పటికప్పుడు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు తమ వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కూడా ఈ కేసులో ఎన్నో అంశాలను తన వాంగ్మూలంలో వెల్లడించారు.ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లను వినియోగించామని… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రికార్డులను అన్నింటినీ ధ్వంసం చేశామని తెలిపారు. రికార్డులు ధ్వంసం చేసి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చినట్లు చెప్పారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోల్, మూసరాంబాగ్ వద్ద మూసీలో పడేశామన్నారు. సీడీఆర్, ఐడీపీఆర్ డేటా మొత్తాన్ని కాల్చేసినట్లు చెప్పారు. ఫార్మాట్ చేసిన ఫోన్లు, పెన్ డ్రైవ్‌లను బేగంపేట నాలాలో పడేశామన్నారు.దాదాపు 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని, వారికి వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకునే వారమన్నారు. నేతలు, జడ్జిలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అంగీకరించారు. పదిహేడు హార్డ్ డిస్క్‌లలో అత్యంత కీలక సమాచారం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాఫ్టువేర్‌ను వినియోగించినట్లు చెప్పారు. 56 మంది ఎస్‌వోటీ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేశామని… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్ ఆపేయాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఆయన రాజీనామా చేసే ముందు రికార్డులన్నింటినీ ధ్వంసం చేయాలని కూడా ఆదేశించినట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article