మే 31 అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. “నా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభంలో మా నాన్న ఒక సలహా ఇచ్చారు. కానీ అది చిన్న సలహానే అయినా, ఎంతో ముఖ్యమైనది. ఎప్పుడూ పొగాకు వాడకాన్ని ప్రోత్సహించవద్దు అన్నదే ఆ సలహా సారాంశం. ఆ సలహాను నేను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాను. మీరు కూడా పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించవద్దు. మెరుగైన భవిష్యత్ కోసం… మనం పొగాకు కంటే ఆరోగ్యాన్నే ఎంచుకుందాం” అని సచిన్ పిలుపునిచ్చారు. కాగా, సోషల్ మీడియాలో సచిన్ స్పందన పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పొగాకు ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న ఇతర క్రికెటర్లను ఏకిపారేశారు. సమాజం పట్ల ఇంత నిబద్ధత ఉంది కాబట్టే భారత్ మిమ్మల్ని (సచిన్ ను) ఒక హీరోగా భావిస్తోంది… పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న ఇతర క్రికెటర్లు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అంటూ నెటిజన్లు పేర్కొన్నారు.