మంగళవారం సినిమా
రివ్యూ..
సినిమా ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడి వరకు తీసుకెళ్లినా కథతో పాటు ప్రేక్షకుడిని కూడా చివరివరకు ఉత్కంఠతో ముందుకు తీసుకువెళ్లడం దర్శకుడి ప్రతిభ..అలాంటి ప్రతిభ
పుష్కలంగా ఉన్న దర్శకుడు
అజయ్ భూపతి..!
The sishya of RGV..
అలా అనే కన్నా EQUALLY TALENTED అనడం కరెక్ట్ ఏమో…!!
తన మొదటి సినిమా శివతోనే రామ్ గోపాల్ వర్మ ఓ పెద్ద సంచలనం సృష్టిస్తే
ఇంచుమించు అదే స్థాయిలో
ఆర్ ఎక్స్ 100 తో తనేమిటో..తన దర్శకత్వ పటిమ ఏపాటిదో ఘనంగా చాటిన అజయ్ భూపతి రెండో ప్రయత్నం మహాసముద్రం
ఈతలో కొంత నిరాశ పరచినా పడి లేచిన కెరటంలా మంగళవారం సినిమాతో మరోసారి
తన సత్తా చాటి మళ్లీ ట్రాక్ మీదకు వచ్చేశాడు.
మంగళవారం..
ఈ టైటిల్లో అంత బలం లేకపోయినా
సెంటిమెంటుతో పాటు ఉత్కంఠ వినిపించింది.
1985 లో వంశీ దర్శకత్వంలో రూపొంది సంచలన విజయం సాధించిన అన్వేషణ సినిమా
మరో కథతో మరోసారి చూస్తున్నట్టు అనిపించింది మంగళవారం చూస్తుంటే.
అదే టేకింగ్..అదే స్థాయి..
సినిమా ఆద్యంతం ఒకే విధమైన టెంపో మెయింటైన్ చేస్తూ తియ్యడంలో దర్శకుడు తన ప్రతిభను చూపించాడు.ఇది హర్రర్ మూవీనా..సస్పెన్స్ థ్రిల్లరా..
అనే సందేహాన్ని క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను చిత్రంగా చిత్ర కథలోకి తీసుకుపోయాడు భూపతి.ప్రేక్షకుడు
ఏ సన్నివేశం మిస్ కాకుండా చూడాలనే ఉత్కంఠ కలిగిస్తూ పటిష్టమైన స్క్రీన్ ప్లేతో చిత్రం ఆద్యంతం నడిపించడం విశేషం.
అంటే ఏ ఒక్క సన్నివేశం వృధా అనిపించకుండా తెరకెక్కించాడు దర్శకుడు.
కథ కొత్తదేమీ కాదు.
నటీనటుల్లో పాయల్
రాజ్ పుత్ మినహా ఎవరూ పెద్దగా పాపులారిటీ
ఉన్నోళ్లు కాదు.
అయితే ఆ ఉన్నళ్ళ నుంచే ఎంత కావాలో
అంత నటనను రాబట్టుకోవడం
దర్శకుడి ప్రతిభకు కొలమానం.దానికి తోడు
అద్భుతమైన కెమెరా వర్క్..
చక్కని బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో పాటు మంచి పాటలు అందించిన సంగీత దర్శకుడు ఈ సినిమాకి మరో ఇద్దరు హీరోలు.
సినిమాలో కథ కంటే కీలకమైన అంశం సైకాలజీ.
ఒక రకమైన మానసిక రుగ్మతతో బాధపడే అమ్మాయి..హీరోయిన్ పాయల్ చుట్టూ కథను నడిపి ఆ కథలోనే తెలివిగా ఎన్నో ప్రశ్నలను చొప్పిస్తూ
ఆ ప్రశ్నల పరంపరలో ఆకట్టుకునే సస్పెన్స్ ను
జత చేస్తూ దర్శకుడు
కత్తి మీద సాము వంటి ప్రయోగాన్ని విజయవంతంగా హ్యాండిల్ చేశాడు.ఈ ప్రయాణంలో చివర్లో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం దర్శకుడికి తన కథ మీద తనకు గల నమ్మకానికి అద్దం పట్టింది.ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ఒక్కోసారి చెయ్యి తిరిగిన దర్శకులు కూడా కొన్ని ప్రశ్నలను ప్రశ్నలుగానే మిగల్చడం మనం చూశాం.అయితే భూపతి మాత్రం ప్రేక్షకుడి మనసులో పుట్టిన
ప్రతి ప్రశ్నకు ఆఖరులో కన్విన్సింగ్ సమాధానం చెప్పాడు.మొత్తంగా ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంత సేపు
ఎన్ని ప్రశ్నలు తనలో
తాను లేవనెత్తుకున్నా అన్నిటికీ సమాధాన పడే థియేటర్ నుంచి బయటకు వస్తాడు.
ఒకరకంగా ఇది సాధించడం
దర్శకుడికి కాస్త క్లిష్టమెన ఫీటే.దానిని పకడ్బందీగా
పూర్తి చేసి మరికొన్ని ప్రశ్నలు..తగిన జవాబులతో మరో సినిమాతో మళ్లీ వస్తా అని చివర్లో హింట్ ఇచ్చాడు భూపతి.తన కథపై..
సినిమాపై ఎంతో నమ్మకం ఉన్న డైరెక్టర్ మాత్రమే ఇలా చెయ్యగలుగుతాడు.
టోటల్ గా ఇది దర్శకుడి సినిమా..ముందే చెప్పినట్టు బలమైన తారాగణం లేకపోయినా కథని
ఇంత రసవత్తరంగా నడపడంలో భూపతి
నూరు శాతం
విజయం సాధించాడు.
కథకు తగ్గ లొకేషన్స్..
అవసరమైన లైటింగ్ ఎఫెక్ట్స్..సంగీతం..
నటీనటుల అభినయం..
అన్నీ చక్కగా సమకూరాయి.
కథతో సంబంధం లేని కామెడీ అన్నట్టు కాకుండా మధ్యలో నవ్వు తెప్పించే సన్నివేశాలు..
కథకు అవసరమే అనిపించే ఎ(సె)క్స్ పోజింగ్..
అన్నీ సమపాళ్లలో నడిచిన సినిమా ఈ మంగళవారం.
మొత్తం మీద ఎంటర్టైన్మెంట్ పక్కా.మళ్లీ మళ్లీ చూడాలని అనిపించకపోయినా
మళ్లీ వచ్చే సినిమా చూసితీరాలి
అనిపించడం గ్యారంటీ.
So…let us see మంగళవారం and wait for బుధవారం..!
సురేష్ ఎలిశెట్టి
9948546286