బిజెపి జిల్లా కార్యదర్శి చాట్రాతి
ప్రజా భూమి , జీలుగుమిల్లి
ప్రతి ఒక్కరు హిందూ ధర్మం పట్ల ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్ అన్నారు. శనివారం ఆయన ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం కండ్రిక గూడెం నుండి భద్రాచలం కు కార్తీక మాసం సందర్భంగా పాదయాత్ర చేస్తున్న కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ హిందూ ధర్మం చాలా గొప్పదని అన్నారు. హిందూ ధర్మం, సంస్కృతిని సంప్రదాయాలను అందరూ అలవర్చుకోవాలని అన్నారు. హిందూ ధర్మంతోనే దేశాన్ని కాపాడుకోగలమని అన్నారు. మన ఆధ్యాత్మిక చింతన పిల్లలు కూడా అవలంబించేలా కృషి చేయాలని అన్నారు. కండ్రికగూడెం పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భద్రాచలం శ్రీరాముని దర్శనానికి వెళ్లడం శుభపరిణామం అని అన్నారు. పాదయాత్రలో భాగంగా కుక్కునూరు మండలం అమరవరంకు సోమవారం చేరుకున్న భక్తులకు అన్న సమారాధన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.