Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంహనుమజ్జయంతి చైత్రంలోనా, వైశాఖంలోనా..

హనుమజ్జయంతి చైత్రంలోనా, వైశాఖంలోనా..

ఎప్పుడు జరుపుకోవాలి?
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

🚩 ఆంజనేయుని జీవితానికి ప్రామాణిక ఉపాసనా గ్రంథం ‘‘పరాశర సంహిత”. ఈ గ్రంథం ద్వారానే హనుమంతుని జననకథ, వివాహాదుల వెనుక రహస్యం, తాంత్రిక విశేషాలు చాలా ఉన్నవి.

🚩 ఐతే హనుమజ్జయంతి వివాదం – ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితం.

🚩 హనుమజ్జయంతి చైత్రంలోనా, వైశాఖంలోనా.. ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు.

🚩 పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమజ్జయంతి చేసుకోవాలి. 
 
🚩 కొన్నిప్రాంతాలలో శ్రీరామనవమి అనంతర పౌర్ణమిని హనుమజ్జయంతి గా జరుపుతారు.

🚩 లంకలో సీతాన్వేషణ చేసి సీతాదర్శనం చేసిన పౌర్ణిమను తాను జ్ఞానిగా పరతత్వ దర్శనం చేసి మరో జన్మను పొందినట్లుగా హనుమత్సందేశంలో చెప్పినట్లు కొందరి వాదన, ఈ ప్రకారం హనుంతుని జన్మదినాన జయంతి జరపాలా ? హనుమంతుని ఆజ్ఞప్రకారం జరపాలా? అన్నది సందేహం. కానీ వారివారి ప్రాంతీయ ఆచారాలను గౌరవిస్తూ, వాటి ప్రకారం రెంటినీ ఆచరించవచ్చు.

🚩 అయితే, కొన్ని ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమజ్జయంతిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. 
 
🚩 అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని జయంతి జరుపుకుంటారు.

🚩 చైత్ర పూర్ణిమ నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున మళ్లీ హనుమజ్జయంతి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు. 
 
🚩 ఇంకా హనుమజ్జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. “కలౌ పరాశర స్మృతి:” అని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
శ్లో:

వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||

అని చెప్పబడింది.

🚩 దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమినాడు హనుమజ్జయంతిని జరుపుకుంటారు.

🚩 ఎక్కడెక్కడ రామనామం వినబడుతుందో అక్కడక్కడ ఆనందాశ్రువులు కారుస్తూ, శిరసువంచి హనుమంతుడుంటాడు.

బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా ఆ జాడ్యం వాక్పటుత్వంచ హనూమత్‌ స్మరణాద్భవేత్‌

🚩 హనుమంతుని స్మరణవల్ల మనకు బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, భయంలేనిస్థితి, బద్ధకం పోవటం, చక్కని మాట్లాడే శక్తి లభిస్తాయి.

🚩 ఈ రోజున – హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలతో స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

   : శ్రీరామదూతం.. శిరసాం నమామి

🙏🌹🙏🌹🙏🌹🙏

శ్రీరామ జయరామ జయజయరామ

“నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేధారిణః నా సామవేద విదుషః శక్య మేవం ప్రభాషితుమ్? సూరం వ్యాకరణం కృత్స్నమ్ అనేన బహుధా శ్రుతం బహు వ్యాహరతా నేన న కించిదపశబ్దితమ్ నముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తథా అన్యేష్వసి చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్ “

అని రామచంద్రమూర్తి వారు లక్ష్మణుడితో చెప్పిన మాటలివి.

🚩 సోదరా లక్ష్మణా! ఋగ్వేదంలో మహాపండితుడు కాకపోతే, యజుర్వేదాన్ని ఆపోశన పట్టి ఉండకపోతే, సామవేదంలో దిట్టకాకపోతే ఇంత స్పష్టంగా, జనులందరికీ ఇంకా ఇంకా వినాలని అనిపించేలా, మృదుమధుర కంఠ స్వరంతో ఇలా పలకగలగడం అసాధ్యం. అలాగే ఇంతసేపు మనతో మాట్లాడుతున్న ఇతను పలికిన ఏ ఒక్క పలుకులోనూ ఎక్కడా ఒక్క అపశబ్ధమన్నది లేనేలేదు.. నోటి నుంచి వస్తున్న మాటల్లో ఎక్కడా వెటకారమన్నది కనపడటం లేదు. అలాగే మనతో మాట్లాడుతున్న వేళ ఎంతో పద్ధతి కనపడుతోంది. ముఖం తిప్పడం, కళ్లుఆర్పడం వంటివేవి ఇతనిలో కనపడటం లేదని లక్ష్మణుడితో హనుంతుని గురించి రామచంద్రమూర్తి వారు చెప్పిన మాటలవి.

🚩 ఋష్యమూక పర్వతం మీద ప్రాణభీతితో జీవనం సాగిస్తున్న సుగ్రీవుడు తమ వద్దకు వస్తున్న రామలక్ష్మణుల నిజ రూపాన్ని తెలుసుకునేందుకు భిక్షుక (సన్యాసి) రూపంలో వెళ్లమని ఆంజనేయుడిని పంపారు.

🚩 అయితే, సన్యాసికి ఉండవల్సిన ప్రధాన లక్షణాల్లో ఒకటి మౌనం. దానిని ఎవరైనా భంగపరిస్తే వచ్చే అసహనం సహజంగానే సన్యాసికి ఉంటుంది. అలాంటి లక్షణాలేవి తమని ప్రశ్నిస్తున్న ఆంజనేయుడిలో లేకపోవడాన్ని రామలక్ష్మణులు గమనించారు. వచ్చిన వాడు అసలు సన్యాసే కాదనీ గుర్తించారు.

‘ఏష దత్వాచ విత్తాని ప్రాప్య చానుత్తమం యశః లోకనాథః పురా భూత్వా సుగ్రీవం నాథ మిచ్చతి పితా హ్యస్యపురా హ్యాసీ చ్చరణ్యో ధర్మవత్సలః తస్య పుత్ర శ్శరణ్య శ్చ సుగ్రీవం శరణం గతః సర్వలోకస్య ధర్మాత్మా శరణ్య శ్శరణం పురా గరుర్మే రాఘవ స్సోయం సుగ్రీవం శరణం గతః”

🚩 …అంటూ హనుమతో చెప్పారట లక్ష్మణ స్వామి.. ‘ఇతను పూర్వం నానా విధములు దానములు చేసిన వాడు.. గొప్ప కీర్తి గడించిన వాడు.. ఇతని తండ్రి మంచి ధర్మవత్సలుడు. ఆయన శరణార్థులను రక్షించే వాడని ప్రతీతి.. ఒకప్పుడు లోకనాథుడిగా కీర్తి గడించిన వారు ఆయన.. నేడు సుగ్రీవుడి శరణాగతిని కోరడానికి వచ్చాడని’ సెలవిచ్చారు.

🚩 అసలు పుట్టుకతోనే అందరి దేవతల శక్తులు పొందారు స్వామి హనుమ. వాళ్ళే స్వయంగా ఓ ఆశ్రమంలో చేర్పిస్తే అక్కడ హోమద్రవ్యాలను పాడుచేయడం, ఆరవేసిన వస్త్రాలను చింపేయడం చేస్తుంటే మునులు ఈ పిల్లవాడికి ఇంత బలం ఇప్పుడవసరం లేదని గ్రహించారు. రామావతారం.. అరణ్యకాండ వస్తే కాని ఉపయోగం ఉండదని భావన చేశారు. పెద్దవాడు అయ్యేవరకు అక్కర్లేని బలం అవసరం లేదని.. అలా ఎవరైనా మహర్షి గుర్తుచేస్తే వచ్చేటట్టుగా మునులంతా అనుగ్రహించారు.

🚩 తదనంతర కాలంలో హనుమ ఋష్యశృంగ పర్వతం చేరి సుగ్రీవుడి వద్ద అమాత్యుడిగా కొలువుదీరారు. సోదరుడి వైరంతో పారిపోయి భూమండలం అంతా తిరుగుతున్న సుగ్రీవుడు అలసిపోయి చివరకు హనుమతో ‘ఇక పరిగెత్తలేను.. దాక్కోవడానికి చోటు ఎక్కడయినా ఉందా? అని అడిగితే… ‘ఎందుకు లేదు! ఋష్యమూక పర్వతానికి వాలి రాలేడని.. అతనికి శాపం ఉన్నదని’ సెలవిచ్చారు హనుమ. ‘మరి ఈమాట ముందు ఎందుకు చెప్పలేదు’ అని సుగ్రీవుడు అడిగితే, ‘మీరు అడగ లేదు.. నేను చెప్పలేదు’ అన్నారు వినమ్రంగా.

🚩 అసలు రామలక్ష్మణులు ఋష్యమూకానికి వస్తున్న వేళ భయపడిపోయి సుగ్రీవుడు పారిపోతుంటే ‘ఎందుకు పరిగెడుతున్నారంటూ’ వెళ్లి పట్టుకుని ప్రశ్నించారు హనుమ. “ఎవరో ఇద్దరు నరులు ఇటుగా వస్తున్నారు చూడు.. బహుశా వాలి పంపి ఉంటాడు వారిని’ అని సుగ్రీవుడు చెబితే, ‘ఇంత పిరికివాడివి.. రేపు రాజ్యం వస్తే ఎలా పరిపాలన చేస్తావు? నీవు రాజువని నేను నిన్ను సేవిస్తున్నాను.. యిలా ఉంటే ఎలా?” అంటూ హనుమ వారించారు. ఎక్కడ ఎలా మాట్లాడాలో బాగా తెలుసున్నవాడు హనుమ. ఆయన చెప్పాడు కాబట్టి సుగ్రీవుడు నిగ్రహించాడు. ‘ఆ వస్తున్న ఇద్దరూ ఎంత తేజోమయంగా ఉన్నారో గమనించమని, పాదుకులు కూడా లేకుండా వస్తున్న విషయాన్ని పరిశీలన చేయమని’ హనుమ సూచన చేశారు సుగ్రీవుడికి,

🚩 సరే, వచ్చిన వారెవరో తెలుసుకురమ్మని.. ఇలా వెడితే గుర్తుపడతారు కాబట్టి లోకమంతా పూజించే సన్యాసి రూపంలో వెళ్లమని హనుమను ఆజ్ఞాపించారు సుగ్రీవుడు. లోకంలో ఎంత మహాపండితుడైనా ఎదురుగా కాషాయ వస్త్రం, చేతిలో కమండలం, దండం ధరించిన ఉన్న వ్యక్తి కనపడితే సాష్టాంగ నమస్కారం చేయడం ఆనవాయితీ.

🚩 అయితే, ఇక్కడ సన్యాసి రూపంలో ఉన్న హనుమ రామలక్ష్మణులను చూడగానే వారి కాళ్లమీద పడి “అయ్యా మీ ఇద్దరినీ చూస్తూ ఉంటే దివ్యంగా కనపడుతున్నారు… మీ ఇద్దరి కన్నులు పద్మపత్రాల్లా ఉన్నాయి… దేవలోకం నుంచి వచ్చారా? మీ కన్నుల్లో రక్షించే తేజస్సు నాకు స్పష్టంగా కనిపిస్తోంది.. మంచి ఆభరణాలతో అలరారిన మీ భుజాలు ఇవాళ నిర్జీవంగా కనిపిస్తున్నాయి.. చాలా శ్రీమంతులుగా కనిపిస్తున్నారంటూ..” .. ఎన్నో విశేషాలతో మాట్లాడారు. రామలక్ష్మణులతో స్వామి హనుమ.

🚩 ఆ తరువాత తన భుజాలపై వారిద్దరినీ కూర్చోబెట్టుకొని పర్వతం మీదకు తీసుకువెళ్లారు.

🚩 ఇలా ఎన్నో విశేషాలమయం ఆంజనేయ స్వామి అవతారం. రేపు హనుమజ్జయంతి పర్వదినం. ఇటువంటి తిథులను, కాలాలను సద్వినియోగం చేసుకున్నవాడి జన్మకు సార్ధకత తప్పకుండా లభిస్తుంది.

శ్రీరామజయం శ్రీరామజయం

🌹🙏🌹🙏🌹🙏🌹

🚩 హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు♪.

🚩 జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు♪. ఒకపూట భోజనం చేసి తీరాలి♪. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు♪. పూర్ణ ఉపవాసం చేయాలి♪.

🚩 హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్క హనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది. భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అలా అని.. మాడ్చమని కాదు♪.

🚩 ఒకే గోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు♪.

🚩 హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు♪.

🚩 ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రుల యందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతి నాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీ ఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్క పండు, ముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే♪.

🚩‌ హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువు యొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు,తిథి హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు. నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. (అవి సులభ మార్గములు.) వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమ యొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత.

🚩 అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్న భక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు.

🚩. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి, అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా, ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత.
రూపంలో
🚩 అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి.

🚩 ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు♪

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article