Friday, November 29, 2024

Creating liberating content

రాజకీయాలుకోయిలలు కనుమరుగవుతున్నాయా…కనుమరుగుచేస్తున్నారా..

కోయిలలు కనుమరుగవుతున్నాయా…కనుమరుగుచేస్తున్నారా..

కాకులు కావుమంటున్నాయా…
కళకు కూడా కులం ఉంటుందా
కళామతల్లికి కులం అంటగడుతున్నదేవరు…
నాడు యువి రత్నం చెప్పింది నిజమేనా ..
గాడిద గొంతు, కాకి స్వరాలకే కాలముందా….
మరీ మథర్ థెరిస్సా ది ఏ కులం…
కలియుగ మథర్ థెరిస్సాకు కుల పిచ్చి ఎందుకో…
కాసులకోసం కులకుంపట్లు తెస్తున్నారా…
తప్పుచేయడానికి కులం అడ్డురాదు…
తప్పులు ఎత్తిచూపితే కులాలు గుర్తొస్తాయా…
ఈ కుల జాడ్యం తో ఇంకెంత కాలం కుట్రలు…
నీకు సై అంటే నీవారు…లేదంటే పరాయి వారా . …
కులాల పేరుతో కాసులు దండుకోవడానికేనా…
మరి మహానీయుల పేర్లు పెట్టు కోవడం దేనికి…
విదేశీ నిధుల కోసం ఇంకెన్నీ వేషాలు..
చేసేది తప్పులు…మళ్లీ చిందులు వేయడమేల…
కళామతల్లి ఏమిటి ఈ గోల…

విజయవాడ:

ఏ కంఠము నుండి కమ్మని రాగము వినిపిస్తుందో ,ఏ కంఠము నుండి తియ్యని గానము వెలువడుతుందో ఆ గానాన్ని విన్న హృదయం పుల కించి ఆ గాన మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ హాయిగా సేదతీరుతుంది.చల్లగా నిదురిస్తుంది.తన్మయత్వం తో ఊగిసలాడిపోతుంది.ఓలలాడుతుంది. ఓదార్పుపొందుతుంది. గ్రుక్కెడు పాలకోసం గుక్కతిప్పుకోకుండా ఏడ్చే చిన్నారి నుచి బరువెక్కిన గుండెతో బ్రతుకు పై ఆశతో ఎదురు చూస్తున్న సగటు మనిషికి చైతన్యం కలిగిస్తుంది ఓ మధురమైన గానం. ఆ గానం పాడిన గాయని కోకిలమ్మ తో పోలుస్తారు.గాయకుడిని గాన గంధర్వుడు అని కొనియాడి ఆ పాటకు పట్టాభిషేకం చేసి ఆ మహనీయుని పాద పద్మములకు నమస్కరించి పూజిస్తారు.ఇది గాణానికి ఉన్న మహోన్నతమైన విలువ.అందుకే అలనాడు రాజులు సామంతులు తమ రాజ్యంలో గాయకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారిని సత్కరించి సంతసించే విదంగా మహారాజులు కూడా అంతటి మర్యాద ఇచ్చేవారు. నేటి తరం లో ఎన్నో వేల గానాలు వినిపించిన స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకనాడు సాష్టాంగా నమస్కారం చేసి తన గురుభక్తిని చాటుకున్నారు.ఇది ఆనాటి నుండి నేటివరకు గానానికి,ఆ గానాన్ని వినిపించిన గాయనీ గాయకుల పట్ల ఉన్న గౌరవం. కానీ నేడు కొంతమంది స్వార్థపరులు తమ వ్యక్తిగత, స్వలభం, స్వప్రయోజనాల కోసం సంగీతాన్ని సంతలో సరుకులా తయారు చేసి సొమ్ముకోసం అర్రులు చాచి అనేక రకాల కుయుక్తులకు పాల్పడుతున్నారు.భూమి పుట్టుక నుంచి మంచి చెడులు ఉన్నాయి.నాటి కాలంలో కూడా కులం వర్ణం జాతీ చూసి అవహేళన చేసేవారు ఉండేవారు. ఈ కులం వాడే పాడాలి,ఈ జాతీ వాడే పాడాలి అన్న వర్ణ భేదాలు చూపించెవారు.కానీ కళామతల్లి నేను ఈ కులం వారినే వరిస్తాను, ఈ జాతివారినే ఉద్దరిస్తారని ఎక్కడైన సూచించిన ఆనవాళ్లు లేవు. ఆ కళామతల్లి ఎవర్ని కరునిస్తుందో ఏ కంఠం నుండి కోయిల గొంతుక వినిపిస్తోందో చెప్పడానికి వీలుకానిది. అది జీర్ణించుకోలేక ఎన్నో కుట్రలు,కుయుక్తులు అవమానాలు, అవహేళనలు చేసి ఆఖరికి ఆ కళామతల్లి బిడ్డల కాళ్లకు మ్రొక్కి తమ తప్పులు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లు అనేక పౌరాణిక, సాంస్కృతిక ,ప్రాచీన సినిమాల ద్వారా మహనీయులు కొవ్వెక్కి కొట్టుకుంటున్న వారికి కనువిప్పు కలిగించె ప్రయత్నం చేశారు.ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కళామతల్లి కరుణ పొందిన తీరులో భాగంగానే కౌతాపూర్ణానంద ధర్మసత్రం ఏర్పరిచారు అప్పటి మహనీయులు.కానీ నేడు కళామతల్లి కి కళంకితం చేసే పరిస్థితి కి దాపురించే విదంగా తయారు అయ్యిందన్న విమర్శలు మూటకట్టు కొంటోంది అదొక పెద్ద విషయం దానిని కాస్త ప్రక్కన పెడితే .. కళారంగం లో కాసులు ఎలా సంపాదించవచ్చు అన్న కొత్త చదువు చదివిన కొంతమంది మేధావులు కళ ముసుగులో కుట్రలకు దారి తీస్తున్నారనే అపవాదు మూటకట్టు కొంటున్నారు. అది ప్రజాభూమి, pbtv సత్యశోధనలో బహిర్గతమవుతూ వస్తోంది తెలిసింది పిసురంత తెలియాల్సినది కొండంత ఉంది.
ఎక్కడో హైదరాబాద్ లో ఫిల్మ్ చాంబర్ లో పనిచేసి పెద్ద పెద్ద వారితో సంబందాలు ఉన్నాయని కొందరు, కొత్త సినిమాలు వస్తే మన బందువులు ఆ థియేటర్లో ఉంటే బ్లాక్ టిక్కెట్ అమ్ముకొన్న మరికొందరు ఇలా రక రకాల వ్యక్తులు కళా రంగంలోకి రావడం కోయిలతో పనిలేదు మాకు ఎవరైనా ఒకటే అని కాసులే పరమావధిగా చేసుకోవడం తో కొంతమంది అసలైన కళాకారులు కకావికలం చెందుతూ కన్నీరు కారుస్తున్నారు.ఇంకొంతమంది కాలక్షేపం కోసం వచ్చి ఇక్కడ కమ్మని రుచులు చూసి కళావాచస్పతి గా,కళను బ్రతికించే వారిగా కళను బ్రతికించడమే వారి డ్రీమ్ అంటూ ,ఎవరి కంఠము నుండి పాడిన నాలో అన్నీ కంఠాలు ఉన్నాయి చాలెంజ్ అంటూ,నేను తక్కువేమీ కాదు ఘంటసాలను మించి పాడతానికి రెడీ అని,మీరు అలా అయితే నేను రెడీ నాతో పెట్టికుంటే పైకి పోతార్, నా సంస్థను తాకితే తుక్కుయిపోతార్ అంటూ ఇంకొకరు ఇలా …చివరికి.. ఏమున్నది ఏమున్నదిరా ఇక ఈ లోకంలో ..పోరాడితే పోతే ప్రాణం అన్న సిరివెన్నెల మాటలు స్పృశించుకుంటూ సరికాద ఎన్నటికయిన ఈ సరిగమ పదనిసలు అని ఎదురుచూస్తున్నారు పేద కళాకారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article