Friday, November 29, 2024

Creating liberating content

రాజకీయాలుప్రజాస్వామ్య ఘాతకులెవరు…

ప్రజాస్వామ్య ఘాతకులెవరు…

వీరితో ప్రజాస్వామ్య పరిరక్షణ మవుతుందా
ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం ఎమిటీ..
ఎవరి చేత ప్రజాస్వామ్యం ఖూని కాబడుతుంది..
ఒక వ్యవస్థ ఇన్నింటిని ప్రభావితం చేస్తుంటే…
నాలుగు స్తంబాలాటలో నలిగిపోతున్నదెవరు…
నాలుగో స్తంభం నాటకీయం అవుతున్నదా…అలా చేస్తున్నారా…
చేష్టలుడిగి సిగ్గుమాలిన పనులకే ప్రాధాన్యాత ఇవ్వడమేమిటీ…
ఇదేనా మీడియా చిత్తశుద్ధి ..
ఇప్పుడున్నది జర్నలిజమేనా…
ఓ నాయక నేటి తీర్పుతోనైనా కనువిప్పు చెందుతావా…
కళ్ళు నెత్తి కెక్కించుకుంటావా…

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్టబడుతోందా…నెట్టవేయబడిందా…లేక నెట్టి వేయడానికే సిద్ధంగా ఉన్నారా అన్న ధర్మసందేహం ఇప్పుడిప్పుడే మొదలుకాబోతుంది.ఇప్పటి తరంలో ఈ వ్యవస్థలు ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నాయా లేక ప్రజాస్వామ్యాన్ని భక్షించడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అసలు ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థను కూల్చి వేస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అందుకేమో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పిదప రాజకీయ ,అధికార ,పార్లమెంటరి విధానాలతో విసిగి వేసారి పోయిన ప్రజలు ఒకనాటి ఆంగ్లేయులు పాలనను గుర్తుతెచ్చుకొంటారని ఆనాడే చక్రవర్తి రాజగోపాలచారి చెప్పింది నిజమేనా అన్న పరిస్థితి ప్రస్తుత సమాజంలో వినిపిస్తోంది.అందుకు గల కారణాలు లేకపోలేదు.ప్రజలను ఉద్ధరించడానికే చట్టాలు ఉన్నాయని చెప్పుకోవడానికే తప్ప ఆచరణలో చిత్తశుద్ధి లేకపోయింది. చట్టాలు అమలుకు కీలకమైన ఆదేశాలు ఇవ్వాల్సిన వ్యవస్థ చేష్టలుడిగి ఉండి పోక తప్పడం లేదు.ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటే ఈ ప్రజాప్రతినిధులు తమ కడుపు నింపు కోవాడానికే పరిమితము అవుతూ సమాజానికి మూలమైన వ్యవస్థ లలో ఒక న్యాయవ్యవస్థను కొంత మినహాయింపు ఇస్తే మిగిలిన అన్ని వ్యవస్థలను తమ అరిపాదాల కింద పెట్టుకున్నారా అన్న విధానానికి ప్రజలు ఆలోచించే స్థాయికి తీసుకు వచ్చారు.
దీనికి కారణం సమాజంలో ఏ స్తంబానికి హానీ జరిగిన అండగా ఉండి ప్రజా చైతన్యం తీసుక రాగలిగిన నాలుగో స్తంభం నడివీదిలో అంగడి సరుకుగా మారిందన్న అపోహ మూట కట్టుగున్నది. ఇందులో వాస్తవం లేక పోలేదు.కులం, మతం వారిగా విడిపోయి తమ ఆర్థిక ప్రయోనాల కోసం అర్రులు చాచుతూ అడగకుండానే రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తున్నాయి.ఎందుకంటే మితి మీరిన ధనదాహం.దానికి తోడు ఈప్రజల్ని శాసించగల సత్తా తమకే ఉండాలన్న కులజాడ్యపు అహంకార ఘీంకారా బలుపు. అలా కాక పోతే మీడియా పాత్ర ఏమిటీ,మీడియాను సమ సమాజం సక్రమంగా నడవడానికి అవసరమైన నాలుగో స్తంభంగా పరిగణలో పెట్టారు. తప్పు చేస్తే మీడియా ప్రజాక్షేత్రంలో ఎండగడితే మనుగడ కష్టమవుతుందన్న భయం ఉండేది.ఇప్పుడు అదే మీడియా తన విలువలను దిగజార్చు కుంటుంటే మిగిలిన వ్యవస్థలు హాయిగా నవ్వుకుంటూ నట్టనడి వీధిలో నాకెవ్వరు అడ్డులేరన్న ధోరణి కి వచ్చేసాయి.అందుకే ఐదుకోట్ల ఆంధ్రులు ఎన్నో ఆశలతో తమ ఉజ్వల భవిష్యత్ కోసం తీర్పు ఇచ్చారు.అది మరికొన్ని గంటల్లో తేలనుంది. విజేతలు ఎవరైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రజాకాంక్షకోసం పరితపించి గాడితప్పిన …తప్పుతోన్న మీడియా వ్యవస్థను సరైనా పద్దతిలో పెట్టాలని కోరుకొంటుంది ప్రజానికం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article