పవన్ కళ్యాణ్..
తన బలమేంటో.. బలహీనతలేంటో స్పష్టంగా తెలిసిన నిఖార్సయిన సైనికుడు..
యుద్ధంలోనైనా…
రాజకీయంలో అయినా
సేనానికి కావలసిన ప్రధాన లక్షణం అదే.
అటు తర్వాత
స్పష్టమైన లక్ష్యం..
దానిని సాధించగలిగే తెగువ..ఇంకా తన బలహంపై పట్టు.తన వైఖరి స్పష్టంగా చెప్పగలిగే నిబద్ధత.
ఎక్కడ తగ్గాలో ముందు తెలుసుకుని ఎలా నెగ్గాలో ఔపోసన పట్టిన యోధుడు..
మనం ఎక్కడ ఉన్నాం..గత ఎన్నికల్లో ఏం సాధించాము కార్యకర్తలకు స్పష్టం చేస్తూ
గతంలో కనీసం పది సీట్లు కూడా తెచ్చుకోలేకపోయిన మనకి ముఖ్యమంత్రి పదవి అడిగే సీనుందా అంటూ తన మెచ్యూరిటీని ప్రకటించిన స్ధితప్రజ్ఞుడు.
వైసిపి మరోసారి అధికారంలోకి రాకూడదనే తన వైఖరి స్పష్టం చేయడమే గాక అందుకోసం తన శక్తులన్నీ ఒడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఆవిర్భావానికి
కారకుడైన నిజమైన రాయబారి..పవన్ కళ్యాణ్..!
ప్యాకేజీ స్టారన్నారు.. ఊరుకున్నాడు..
నిలకడ లేనోడని నిందలెత్తారు..
నిలబడ్డాడు..
ముగ్గురు పెళ్లాలంటూ
వ్యక్తిగత జీవితంపై
కూడా బురద జల్లే
ప్రయత్నం చేశారు..
జూలు విదిలించాడు..
తిరగబడ్డాడు..
వేషాలేసుకునేటోడు
రాజకీయం ఏం చేస్తాడు..
ప్రజా సమస్యలు
ఎలా తెలుస్తాయని ఎకసెక్కాలాడారు..
చూపిస్తా ఆగమంటూ
జగన్ కే హెచ్చరికలు చేశాడు..
అంతటి మెగాస్టారే
చాప చుట్టేసాడు..
ఇంక ఇతగాడెంతని
చిన్న చూపు చూసారు..
కళ్ళు తెరిపించాడు..
విశ్వరూపమే చూపించాడు..
తానే గెలవలేనోడు
ఇంక ముందుండి పార్టీని
ఏం నడిపిస్తాడని
నవ్వుకున్నారు..
21..బోణీ..
ఇక వినిపిస్తుంది చూడు
ఢిల్లీ వరకు నా వాణి..
సవాలు స్వీకరించాడు..
మొనగాడయ్యాడు..
ఎన్నో విన్నాడు…
అన్నీ భరించాడు..
రాయిలా..రాయల్ గా
నిలబడ్డాడు..
2024 ఎన్నికల్లో
అన్నీ తానే అయి కథ నడిపించాడు..
ఈ ఎన్నికల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి తానే కా”రణమై”..
ఇంకెప్పుడూ కలవరనుకున్న
నరేంద్ర మోడీని..
చంద్రబాబుని కలిపి
అధికార పార్టీకి కలవరం..
కంపరం పుట్టించాడు..!
అసలు వైసిపి వ్యతిరేక
పవనం మొదలు కావడమే
పవన్ కళ్యాణ్ తో..
ఉద్దానంలో ఆగని పోరాటంతో
పవన్ కళ్యాణ్
ఈ రాష్ట్రంలో
ప్రభుత్వ వ్యతిరేక
వాతావరణానికి
మొదటగా తెర ఎత్తాడు..
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం
ఎలుగెత్తుతూ జగన్ గుండెలో తొలిసారిగా
భయం పుట్టించి
అసలు చంద్రబాబు కంటే పెద్ద ప్రమాదం పవనే అన్న
భావనకు ఊపిరి పోశాడు..
అంతే..అక్కడి నుంచి జగన్ తప్పుల మీద తప్పులు చేస్తూ ఎన్నికల నాటికి
సెల్ఫ్ గోల్ వేసుకున్నంత
పని చేశారు..!
విశాఖ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడంతో మొదలైన
జగన్ వ్యతిరేక పవనాలు
అలా నానాటికీ ఉధృతమై
ఇదిగో..ఫలితాల నాటికి
వైసిపి చతికిలపడిపోయింది.
చంద్రబాబు అరెస్ట్..జగన్ ఏమి ఆలోచించారో గాని
అది ఖచ్చితంగా బెడిసికొట్టింది.
చంద్రబాబుని రెండు మెట్లు ఎక్కించింది..
అదే సమయంలో
లోకేష్ ఇమేజ్ ను పెంచింది..ముద్దపప్పు అని ఎగతాళి చేసిన లోకేష్
ఆ సమయంలో
గట్టిగా నిలబడి చంద్రబాబు అరెస్టు ఉదంతాన్ని
జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకువెళ్ళడంలో కృతకృత్యులయ్యాడు.
అంతే కాదు..
అప్పుడే ఎన్టీఆర్ కూతురు..
బాబు సతీమణి..
లోకేష్ తల్లి అయిన భువనేశ్వరి తొలిసారిగా ప్రజల్లోకి వచ్చి
తన కుటుంబం పట్ల..
పార్టీ పట్ల
సానుభూతి పెరగడంలో
ముఖ్యభూమిక పోషించారు..
ఇక్కడ కూడా పవనే..
మొత్తంగా బాబు వర్గం వెనక ఉండి విషయాన్ని
మోడీ వరకు తీసుకువెళ్ళి
రాష్ట్రంలో పరిస్థితి ఇదీ అని
పెద్దాయనకు వివరించి
ఆయన దృష్టిని చంద్రబాబు వైపు మళ్ళించడంలో సఫలీకృతులయ్యారు..
ఇదే మొన్నటి ఎన్నికల్లో
అత్యంత కీలకం..
అన్నిటిలో పవనే
సెంటర్ పాయింట్..!
అన్నిటి కంటే ముందుగా..
2024 ఎన్నికల్లో
వైసిపి వ్యతిరేక ఓట్లు
చీలిపోకూడదు
అనే కీలకమైన నినాదాన్ని ఎత్తుకుని దానికే
కట్టుబడి ఉండి
ఎన్నో రాజీలకు
తలొగ్గి ఈ ఎన్నికలను
మహాసంగ్రామంగా
మార్చిన నిన్నటి అజ్ఞాతవాసి..
నేటి కూటమి హస్తవాసి..!
రేపటి స్థిర నివాసి..!!
సినిమా హీరో రాజకీయంగా జీరో అనుకుంటే..
మోడీకి..బాబుకి యారోగా
మారి..ప్రత్యర్ధి
నీరు గారి నీరోగా
అవతరించిన పరిస్థితి
కల్పించిన పవన్ కళ్యాణ్
2024 ఎన్నికల్లో
నిస్సందేహంగా..
రియల్ హీరో..!
ఇక్కడితో కథ అయిపోదు.
రేపు కూటమి ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వంలో
పవన్ పాత్ర కీలకం.
చంద్రబాబు తర్వాత జనసేనాని ఖచ్చితంగా
నంబర్ టూ..
ఉపముఖ్యమంత్రి అని ఇప్పటికే ప్రచారం మొదలైంది.
హామీల అమలులో పవన్ నిక్కచ్చిగా ఉంటారు.
రాజీపడరు.అలాగే మోడీతో తనకు గల సాన్నిహిత్యాన్ని సొంతానికి గాక రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించడం ద్వారా
ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్
ఎనలేని మేలు చేయబోతున్నారన్నది
నిస్సందేహం. సో..
ఆ కోణంలో ఎన్నికల ముందు..ఎన్నికల్లో..
అటు తర్వాత కూడా..ఈ రాష్ట్రంలో వీచేవి ఖచ్చితంగా
పవనాలు..
పవన్ కళ్యాణ్..
మెగా కుటుంబంలో పుట్టిన మొనగాడు..
ఎనీ డౌట్!?_
ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286