ఎన్నికలలో కూటమి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకులతో పాటుగా పలువురు సినీ తారలు కొందరు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే, మరికొందరు అసెంబ్లీ స్థానాల కోసం బరిలోకి దిగారు. మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన సినిమా తారలు ఎవరు అన్న వివరాల్లోకి వెళితే.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
జనసేన పార్టీ వ్యవస్థాపకుడు కూడా అయిన పవన్ కళ్యాణ్ పీఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయనతో పాటు జనసేన పార్టీకి చెందిన 21 మంది అభ్యర్థులు కూడా విజయం సాధించారు.అలాగే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ దాదాపుగా గత ఐదారేళ్లుగా బీజేపీకి అనుకూలంగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. అందుకు ప్రతిఫలంగా ఈ సారి లోక్‌సభ టిక్కెట్ దక్కించుకుంది. బరిలోకి దిగిన తొలి ఎన్నికల్లో కంగనా విజయం సాధించింది. కంగనా హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి లక్షకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించింది.అలాగే సురేష్ గోపి మలయాళ నటుడు సురేష్ గోపీ కేరళలో చరిత్ర సృష్టించారు. శ్రీశూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన ఘన విజయం సాధించారు. కేరళలో బీజేపీకి ఇదే మొదటి విజయం. ఈ సందర్భంగా తన విజయాన్ని మోదీకి అంకితం చేశారు సురేష్ గోపి. అదేవిధంగా ప్రముఖ భోజ్‌పురి నటుడు, రేసు గుర్రం విలన్ రవి కిషన్ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అలాగే భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, గాయకుడు మనోజ్ తివారీ ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశారు.