Wednesday, November 27, 2024

Creating liberating content

తాజా వార్తలుజగన్ చెప్పిట్లే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయింది

జగన్ చెప్పిట్లే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయింది


• ప్రజలు ఇచ్చిన తీర్పు 5 కోట్ల ఆంధ్రుల విజయం
• జగన్ అరాచక, నిరంకుశ, నియంతృత్వ రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిళించారు
• ప్రజా తీర్పుపై ఆత్మ విమర్శ చేసుకోకుండా ప్రజలపై నెపాన్ని నెట్టడం సిగ్గుచేటు
• నీతిలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డే
• ప్రజలే జగన్ రెడ్డిని మోసం చేశారంటూ వైసీపీ సోషల్ మీడియ ప్రచారం చేయడం హేయమైనచర్య

ప్రజలే తనను మోసం చేశారంటూ జగన్ రెడ్డి మాట్లాడటం కంటే సిగ్గుమాలిన, హేయమైన చర్య ఇంకోకటి లేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రజా తీర్పుపై ఆత్మ విమర్శ చేసుకోకుండా ప్రజలపై నెపాన్ని నెట్టడం సిగ్గుచేటన్నారు. జగన్ అరాచక, నిరంకుశ, నియంతృత్వ పాలనను కూకటి వేళ్లతో ప్రజలు పెకిళించారని తెలిపారు. జగన్ చెప్పిట్లే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయిందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు.. 5 కోట్ల ఆంధ్రుల విజయమని పేర్కొన్నారు.

నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..

నీతిలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డే. అమ్మఒడి ఇచిన అమ్మలు, అవ్వతాతలు మోసం చేశారనడం దారుణం. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రత్యేహోదా సాధించలేదు, సీపీఎస్ రద్దు చేయలేదు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయ లేదు, మెగా డీఎస్సీ వదల్లేదు. అందుకే ప్రజలు సరైన తీర్పును ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను జగన్ రెడ్డి మోసం చేసినందుకే ఈ తీర్పు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై హత్యలు, అత్యాచారాలు, అరాకాలు జరుగుతున్నా జగన్ రెడ్డి నోరు మెదపనందుకే ఈ జగన్ పాలనను ప్రజలు ఓట్లతో అధ:పాతాళానికి తొక్కారు. రాజధాని పేరుతో మూడుముక్కలాటాడి రాజధానికి ఒక్కఇటుక రాయి కూడా వేయకుండా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకే జగన్ రెడ్డిని ఘోరం ఓడించారు. ఏపీకి జీవనాడిగా మారే పోలవరాన్ని ముంచింనందుకే వైసీపీని పాతిపెట్టారు. పాలకులు అనే వాళ్లు యజమానులు కాదు సేవలకు అనే వాస్తవాన్ని మరిచిపోయి జగన్ రెడ్డి ఒక హిట్లర్, ముసోలిని, ముసారఫ్ లను మించినటవంటి నిరంకుశ, నియంతృత్వ పాలనను సాగించాడు. అందుకే ప్రజాగ్రహంలో జగన్ రెడ్డి కొట్టుకుపోయాడు. మళ్లీ ప్రజల తీర్పును అపహాస్యం చేసేలా మాట్లాడటం సిగ్గుమాలిన చర్య. ప్రజలు విజ్ఞతతో ఓట్లు వేస్తే ఆ విజ్ఞతను ప్రశ్నేంచేలా, నింధలు వేసేలా మాట్లాడటం దారుణం. తన తప్పిదాలు, తన చేతగాని తననాన్ని ప్రజలమీద నెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి. 99% మేని ఫెస్టోను అమలు చేశానని పదే పదే అబద్దం చెబితే అది నిజం కాదని జగన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి.

జగన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు ఏం చెప్పాడు… వచ్చాక ఏం చేశాడు? 25మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు.. రాజ్యసభతో కలిసి మొత్తం 31 మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదు. వారంలో సీపీఎస్ రద్దు అన్నాడు ఆ హామీనే తుంగలో తొక్కాడు. ప్రతి సంవత్సరం డీఎస్సీ, మెగా డీఎస్సీ అన్నాడు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఐదు జనవరిలు పూర్తి అయినా ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. పోలవరాన్ని 2020 జూన్ కు పూర్తి చేస్తామని ఒకసారి, 2021 అగస్టు కు పూర్తి చేస్తానని మరోసారి 2022 డిసెంబర్ అని మరోసారి మాట మారుస్తూ పోయి పోలవరాన్ని ఎలా ముంచారో ప్రజలందరికి తెలుసు. ప్రతి పక్ష నాయకుడిగా అమరావతిని స్వాగతిస్తున్నానని అప్పుడు రాజధానికి 30 వేల ఎకరాలుండాలని చెప్పిన జగన్ రాజధానికి ఒక్క ఇటుక వేయక పోగా 3 మూడు ముక్కల ఆట ఆడి అమరావతిని ముంచాడు. అధికారంలోకి వచ్చిన వారంలో ప్రజా వేధికను కూల్చి రాష్ట్రాలో అరాచకాన్ని ప్రారంభించాడు. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల 138 సంక్షేమ పథకాలు రద్దుచేశాడు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించించి దోచుకున్నాడు. అన్న క్యాంటిన్ లను రద్దు చేసి పేదల పొట్టకొట్టాడు. పెళ్లికానుకు రద్దుచేసి ఆడ బిడ్డలకు అన్యాయం చేశాడు. మద్యపాన నిషేదం అని బ్రాందీ షాప్ లను సొంతం చేసుకుని కల్తీ మద్యం, నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు. ఏపీలో మైన్స్ ను, గనులను కొల్లగొట్టారు. విలువలైన ప్రభుత్వ భూములను కొట్టేశారు, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి దోచుకున్నారు. వ్యక్తుల ఆస్తులను కొల్లగొట్టడానికి ల్యాండ్ టైటింలింగ్ యాక్ట్ తీసుకు వచ్చారు. అధ్వాన రోడ్లు అధ్వానంగా ఉన్నా గుంతలు కూడా పూడ్చలేదు.

నిత్యవసర వస్తువుల ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపారు. ఎన్టీరామారావు స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే… జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత 24 శాతానికి కోత పెట్టాడు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దళితులపై హత్యలు, అత్యాచారాలు, శిరోముండన ఘటనలకు గురైనా కనీసం నోరు విప్పక పోగా.. దళిత బిడ్డను డోర్ డెలివరి చేసిన వ్యక్తిని వెనకేసువచ్చాడు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. దళితుల 27 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. రాజధానికోసం రైతులు భూములు ఇస్తే మహిళా రైతులను బూట్ల కాళ్లతో తన్నించాడు. ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను ఇలా పన్నులతో జనాన్ని దోచుకున్నాడు. 12,900 గ్రామా పంచాయతీలను సంక్షోభంలోకి నెట్టాడు. కేద్రం ఇచ్చిన నిదులు ధారి మళ్లించి సర్పంచ్ లను భిక్షాటనకు తీసుకు వచ్చాడు. కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన రూ.1000 తప్పా వైసీపీ ప్రభుత్వం ఒక్కరూపాయి సాయం చేయలేదు. పక్క రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చిన వెయ్యికి నాలుగు వేల నుండి ఐదు వేల వరకు ఇచ్చి ఆ రాష్ట్రాల్లో కోవిడ్ సమయంలో ప్రజలను ఆదుకున్నారు. ఇక్కడేమో కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇవ్వలేదు. వైసీపీ పాలనలో వరి రైతులు, ఆక్వా రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటించారు.

జగన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు కూడబెట్టుకోవడానికే… ప్రజలకు సేవ చేయడబానికి కాదు. 2004లో రాజశేఖర్ రెడ్డి అఫిడవిట్ వేసికనప్పుడు జూబ్లిహిల్స్ లో చిన్న ఇల్లు, రెండు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ అని చూపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల కోట్లు ఎలా వచ్చాయి? తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి దోచుకున్నాడు. 2019లో కూడా జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత శ్యాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ తో ఎక్కడికి అక్కడ ఆదాయాన్ని పంచుకుని దోచుకున్నారు. రాష్ట్రాన్ని భాగాలుగా విభజించి దోచుకోవడానికి విజయసాయిరెడ్డి, వైవీసుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలాంటి నాయకులను పెట్టుకున్నాడు. అందుకే ప్రజలు వైసీపీకి ఘోర ఓటమిని ఇచ్చారు. ఐదేళ్లు అబద్దాన్ని నమ్ముకున్న ఈ జగన్ రెడ్డి నిన్న కూడా అబద్దాలే మాట్లాడారు. ఎవరైనా కొనఊపిరితో ఉంటే నిజం మాట్లాడుతారు. జగన్ ఊపిరి పోతున్న నిజం మాట్లాడలేకపోతున్నాడు. ఘోర ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రజల మీద నింధలు వేయడం, ప్రజలపై అక్కసు కక్కడం చాలా హేయమైన చర్య. నేను బటన్ నొక్కుతున్న మీరు కూడా బటన్ నొక్కమంటే … ఈ ఐదేళ్ల అరాచక, కక్షపూరిత, నిరంకుశ, నియంతృత్వ అవినీతి పాలనకు సరైన బటన్ నొక్కి జగన్ అధ:పాతాలనానికి తొక్కి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా జగన్ నియంతృత్వ, నిరంకుశ విడనాడి ప్రజా బద్ధంగా నడుచుకోవాలి

ఈవిఎంల తీర్పుపై వైసీపీ నేతల మాటలు ప్రజాస్వామ్య తీర్పును కించపరచడమే. ప్రజలు చాలా కసితో ఓట్లు వేశారు. 1983లో టీడీపీ ఆవిర్భవించినప్పుడు కూడా లేని ప్రభంజనం 2024 లోకనిపించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత చెత్తగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని ప్రజలు తీర్పుతోనే అర్థం అవుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి జగన్ రెడ్డి అడుగు బయటపెట్టలేదు… ఏ శాసన సభ్యుడికి జగన్ రెడ్డిని కలవడానికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఒక వేళ అడుగు బయటపెడితే పరదాల చాటున, పోలీసుల భద్రతతో బయటకు వచ్చిన పరిస్థితి. అభివృద్ధి సంక్షేమం మీద జగన్ రెడ్డి ఒక్క రోజు కూడా దృష్టి పెట్టలేదు… ఇసుకలో, మందులో, మట్టిలో ఎలా దోచుకోవాలన్నదే జగన్ ద్యాసంతా అందుకే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. నాయకుడు ఎప్పుడూ ప్రజలతో మమేకం కావాలి. ప్రజల సమస్యల సమస్యలను పట్టించుకోవాలి ప్రజల్లో ఉండాలి. దాన్నిజగన్ రెడ్డి మరిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article