- టిడిపి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి
వేంపల్లె :టిడిపి పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు అన్ని రకాలుగా అండగా ఉంటామని టిడిపి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డితో కలిసి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ టిడిపి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో రాష్ట్రంలో టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అలాగే పులివెందుల నియోజకవర్గంలో కూడ టిడిపి పార్టీ వెంట నడిచి మంచి ఓట్లు శాతం సాధించారని చెప్పారు. ఎన్నికల్లో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నిజాయితీగా పని చేయడం వలన బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డికి మంచి ఫలితాలు వచ్చినట్లు చెప్పారు. టిడిపి పాలనలో ప్రతి కార్యకర్తకు అన్ని విధాలా అందుబాటులో ఉండి వారి కష్టాల్లో పాలు పంచుకొంటామని చెప్పారు. మరింత టిడిపి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కూడ ముందుడాలని కోరారు. ప్రజల సమస్యలను కూడ తెలుసుకొని పార్టీ దృష్టికి తీసుకొని రావాలని కోరారు. ఎన్నికల్లో సహయం చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో చూపించిన అభిమానానికి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో టిడిపి నాయకులు భరత్ రెడ్డి, రవితేజా రెడ్డి, మహమ్మద్ షబ్బీర్, జగన్నాథరెడ్డి, బాలస్వామిరెడ్డి, నిమ్మకాయల మహమ్మద్ దర్బార్, ఎస్వీ. రమణ, తెలంగాణ వలి, మడక శ్రీనివాసులు, నామా వేమకుమార్, ఎస్.రజనీకాంత్ రెడ్డి (సూరి), కిషోర్, డివి.సుబ్బారెడ్డి, పాపిరెడ్డి, కరీముల్లా, అల్లాబకాస్, పీరా సాహెబ్, మహమ్మద్ ఇనాయతుల్లా, డక్కా రమేష్, జబీబుల్లా, తో పాటు టిడిపి నాయకులు పాల్గొన్నారు.