బట్టల్ని అన్నింటినీ ఒకేసారి ఆరబెట్టద్దు. కొన్ని బట్టలు ఉతికిన తర్వాత, అవి ఆరిన తర్వాత మరికొన్ని బట్టల్ని ఆరబెట్టండి. దీంతో బట్టలు త్వరగా ఆరతాయి.ఐరన్ చేయడం వల్ల కూడా బట్టల్ని ఈజీగా ఆరబెట్టుకోవచ్చు. దీని వల్ల బట్టలు పొడిగా అవుతాయి. అయితే, మరీ తడి బట్టలపై ట్రై చేయొద్దు. అలానే, తడి బట్టలు ఆరేసేందుకు మీరు టవల్స్‌ని కూడా వాడొచ్చు. ఇందుకోసం టవల్స్ వేసి తర్వాత అందులో ఆరబెట్టే బట్టలు వేయండి. అందులోని నీరు టవల్ పీల్చుకుంటుంది. తర్వాత రెండింటిని ఆరబెట్టేయండి.అదే విధంగా, రూమ్‌లో బట్టలు ఆరేసి ఫ్యాన్ వేయడం మరో బ్రిలియంట్ ఆలోచన. దీనికోసం మీరు టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ ఏదైనా వాడొచ్చు. దీంతోపాటు, వర్షం పడినప్పుడు కిటికీలు, తలుపులు తెరవండి. గాలి వస్తుంది. ఆ గాలికి ఎదురుగా బట్టల్ని ఆరేయొచ్చు.హెయిర్ డ్రైయిర్‌ని వాడి బట్టల్ని ఆరేసుకోవచ్చు. దీని వల్ల చిన్న చిన్న బట్టల్ని ఈజీగా ఆరబెట్టుకోవచ్చు. కానీ, లో టెంపరేచర్‌లో ఆరబెట్టాలి. అదే విధంగా, డీహ్యుమిడిఫైయర్ వాడితే గాలిలో తేమ త్వరగా ఆరిపోతుంది. దీనిని తడి బట్టల దగ్గర వాడినా తేమ తగ్గి బట్టలు పొడిగా మారతాయి. కాబట్టి, హ్యాపీగా వీటిని వాడి బట్టల్ని ఆరబెట్టుకోవచ్చు.ఇంట్లోనే బట్టలు ఆరబెట్టాలంటే డ్రైయింగ్ రాక్, క్లాత్ లైన్ వాడొచ్చు. దీనిని మనం ఇంట్లోనే వెలుతురు, గాలి వచ్చే ప్లేస్‌లో పెట్టి వాటిని ఆరేసుకోవచ్చు.