Monday, April 21, 2025

Creating liberating content

తాజా వార్తలుప్రజల నుండి వచ్చే అర్జీలను వెనువెంటనే పరిష్కరించాలి.

ప్రజల నుండి వచ్చే అర్జీలను వెనువెంటనే పరిష్కరించాలి.

ప్రజా భూమి రాజమహేంద్రవరం,

ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కరించాలని కేసిఆర్ డివిజన్ తహసీల్దార్ శ్రీమతి డి సుగుణ అన్నారు.

  సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో   నిర్వహించిన స్పందనలో ఆర్డీవో తరపున కె.ఆర్.సి. సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం  తహసీల్దార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా  శ్రీమతి డి సుగుణ ప్రజల వచ్చిన నాలుగు అర్జీలను స్వీకరించారు. ఈరోజు  రేషన్ కార్డు ఇప్పించవలసినదిగా కోరుట, పించను, రెవెన్యూ, శానిటేషన్  తదితర అంశాలకు సంబంధిచి  నలుగురు నుంచి అర్జీలను స్వీకరించా మన్నారు. 

ప్రజాసమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం స్పందన, జేకేసి, ఇప్పుడు జగనన్న సురక్ష ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి జిఎఎల్ఎస్. దేవి, మునిసిపల్ కార్పొరేషన్, డివిజనల్ పంచాయతీ అధికారి, ఐసిడిఎస్ సివిల్ సప్లైస్, బిసి వెల్ఫేర్, ఏపీఎస్ఆర్టీసీ, హౌసింగ్, ఇరిగేషన్, ఆర్.డబ్ల్యూఎస్, ఫైర్, సాంఘిక సంక్షేమ, వైద్య, ఆరోగ్య, లేబర్, పశుసంవర్ధక, పరిశ్రమలు, డాక్టర్ ఎస్సార్ ఆరోగ్యశ్రీ తదితర డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article