ప్రజాభూమి పోరుమామిళ్ల:
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమే ఎస్.ఎఫ్.ఐ నిరంతరం పోరాడుతుందని ఎస్.ఎఫ్.ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి అన్నారు. సోమవారం ఉదయం ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి రోజుకొక జీఓ తీసుకువస్తు విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తుందన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని ఎక్కడ అమలు చేయకున్న రాష్ట్రంలో మాత్రం శరవేగంగా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగానే జీఓ నెంబర్ 117 తీసుకొని వచ్చి గ్రామీణ ప్రాంతాలలో వుండే ప్రాధమిక పాఠశాలలో 3,4,5 చదివే విద్యార్థులను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తుందన్నారు. దీని ద్వారా ప్రాధమిక పాఠశాల విద్యా వ్యవస్థ నిర్వీర్యమై గ్రామీణ ప్రాంతాలలోని పేద విద్యార్థులు అందరూ విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. జీఓ నెంబర్ 77 తో పీజీ చదివే విద్యార్థులకు పూర్తిస్థాయిలో రీయింబర్స్ మెంట్ ఆపేసి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందన్నారు. పెండింగులో ఉన్న జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు పూర్తిస్థాయిలో విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుకుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కరించాలని ఇప్పటికే అనేక విధాలుగా ఆందోళనలు చేసినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా పోలీసులతో అక్రమ అరెస్ట్ లు చేయించి ఉద్యమాలను అనాచాలని చూసిందని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మండల సహాయ కార్యదర్శి వంశి, చారి, మండల నాయకులు అశోక్, బంగారు, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.