- గరుడునిపై శ్రీవారి దర్శనం
- భక్తితో పరవశించిన శ్రీవారి భక్తులు
రామచంద్రపురం
తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ దేవాలయమైనఅప్పలాగుంట లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవరోజు శుక్రవారం రాత్రి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామివారు గరుడవాహనం నుంచి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.గరుడ వాహనంపై విహరించే స్వామి వారిని దర్శించిన భక్తులు హారతులతో మొక్కలు తీర్చుకున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోను గరుడసేవ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు భక్తుల ప్రపత్తికి తాను దాసుడవుతానని చెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగు తాయని భక్తకోటికి తెలియజెపుతున్నాడని ఆలయ పండితులు తెలిపారు.మహిలలు స్వామి వారికి హారతి సమర్పించారు. గోవింద నామ స్మరణలతో మార మ్రోగిన మాడవీధులు.