కళా సంస్థలూ వారివేనట… వారే కళాకారులట
వారే అవార్డులు ఇచ్చుకుంటారట…వారిదే అక్కడ అధిపత్యమట..
వారు చెప్పిందే వేదమట…వారి పాడిందే పాట…
వారు ఏది చేసినా చూడాలంతేనట..
కథనాలు రాయాలంటే వారి అనుమతి కావాలంట. ..
నంది, ఉక్కు, గానగంధర్వులు, చాలెంజ్ ఏదయినా సరే…
ఆ గది ఏది అనుకుంటే అదే జరగాలట ..
కాదంటే ఖతం చేస్తారట…
తప్పులు ఉన్నాయట…అయినా కథనాలు రవద్దట…
సరదాకోసమే సంగీతమట…
ఆ సంగీతం కూడా వారిష్టమేనట…
వారు పాడిందే పాట…ఆడిందే ఆటట…
తప్పులు ఎత్తిచూపితే తప్పంట ..
కౌతాళంవారికే ప్రత్యేక చట్టాలు ఉన్నాయట…
రామమోహన్ రెడ్డి, సంపాదకులు
మన బంగారం మంచిది అయితే స్వర్ణకారుడికి దగ్గరకు ఎందుకు వెళ్తుందో అన్న సహజ న్యాయం అక్కర్లేదు. తప్పు నకిలీ బంగారం ది కాదు అది నకిలీ బంగారు అని చెప్పిన వారిదే తప్పు ఇది ఇక్కడ న్యాయం. బెదిరించిన, భయబ్రాంతులకు గురిచేసిన,నేరుగా కార్యక్రమం ఎలా జరుగుతుందో అన్న తప్పుకాదు.. అలా అన్నారని అంటే అదే పెద్ద నేరం…అయ్యో అక్కడ ఇంత దారుణమా అంటే దాడిచేయచ్చు అదయితే తప్పు కాదు ..అంటే వారు ఏది చేసినా నేరం కాదు…నేరం నాది కాదు అది నేరమా కాదా అన్నవాడిదే పెద్ద తప్పు ఇక్కడ… ఇదేమి విచిత్రమో మరి ఇక్కడేమైన ప్రత్యేక రాజ్యాంగం ఉందొ మరి తెలియని పరిస్థితి.భూమి పుట్టుక నుంచి సనాతన సంప్రదాయం ప్రకారం సంగీతానికి ఒక కొల మానం ఉంది. స్వరాలు ఎలా ఉండాలి.. ఎలా ఉంటే రాగయుక్తంగా ఉంటుంది.. ఏది ఉచ్ఛము… ఏది నీచము,ఏవి అనులోమ విలోమాలు …అలంకారములకు అనుగుణంగా శృతి లయలు ఉన్నాయా లేదా అన్నది సరిగా చూసి జాగ్రత్త పడి ఓ గానాన్ని ఆలపిస్తారు..ఏ గానం ఎవరి గొంతుక నుండి వెలువడితే మాధుర్యం ఉంటుందో కూడా ఒకటికి పది సార్లు సాధన చేసి సరిగమలు సక్రమంగా పలుకుతున్నాయా లేదా అన్న ప్రామాణికాలు చూసుకొని పాట పాడిస్తారు.ఇది పూర్వపు ఆచారాలు.అయితే ఈ ఆచార వ్యవహారాలు ఒక్కరికే సొంతం అన్న అహంతో ఉన్నవారు లేక పోలేదు…అహం బ్రహ్మస్మ్ అన్నారు పెద్దలు. అహం అనేది అన్ని వేళల పని చేయదు..అది తాత్కాలికముగా ఆహా ఓహో అనిపించిన కాల గమనంలో ఎందరో చక్రవర్తులు,రాజులు,సామంతులు కాల గర్భంలో కలిసి పోయారు…ఇది చరిత్ర.కానీ కౌతాళంలో ఉన్న కొంతమంది తామే సృష్టి కర్తలమనే భావన,బ్రాంతిలో ఉంటూ అందరిని భ్రమింప చేస్తూ తామే రాజాది రాజుల మని తాము పాడిందే పాట అని,తాము చెప్పిందే వేదమని తాము ఏమి చేసిన ఎవరు ఏమి అనకూడదని శాసనాలు రచించినట్లు బడాయి మాటలు మాట్లాడుతూ పేద కళాకారులను,నిజమైన గాయనీగాయకులను విస్మరించడం అలవాటుగా మారింది.అయితే ప్రజాభూమి దినపత్రిక కళారంగంలో జరుగుతున్న తీరు తెన్నులు,లోపాలు ఎత్తిచూపుతూ ఎన్నో బెదిరింపు లు,తిట్ల పురాణాలను లెక్క చేయక కళల పట్ల జరుగుతున్న తీరు తెన్నులను కళామతల్లి బిడ్డలకు తెలియజేస్తూ వస్తుంది. కౌతాళంకు గ్రహణంగా మారిన ఆ గది ,ఆ గదిలో జరుగుతున్న తీరు తెన్నులు,అక్కడ వారు చేస్తున్న అన్నీ సక్రమే కాదంటునే తాము అనుకున్నదే జరగాలి…తమ వారు చేసిన చేస్తున్నవి సక్రమమో కాదో కూడా తెలుసు అయిన నిజాలు బహిర్గతం అయితే అది పెద్ద నేరమన్న వితండవాదానికి దిగి బెదిరించాలని చూడటం సంస్కారం మరిచి మాట్లాడడం పరిపాటిగా మారిన నేపధ్యంలో ఉంటే చేసేది ఏముంటదో మరి అర్థం కానీ పరిస్థితి. చదువు చదివితే జ్ఞానం విజ్ఞానం రాదన్న లోకోక్తి ఇక్కడ వర్తించడం లేదు….సంగీతం లో ఓనమాలు రాకపోయిన వారంతా గాన గంధర్వులు, చాలెంజ్ సింగర్ లు,జాతీయ ఆంటార్జాతీయ గాయనీ గాయకులు….వీరందరికి అండగా ఉంటే ఉక్కు లు బంగారాలు…సిల్వర్ల్… ఇలా వారిస్టమొచ్చిన బిరుదులు ఇచ్చిన ఆవేమిటీ అనకూడదు. కళావాచస్పతి బిరుదులు ఇచ్చిన కూడా అది ఎంత తప్పు అన్న తెలిసినా కూడా అయ్యో ఎంత మంచి చేశారు అని పొగడాలి.ఇది తప్పుగా అంటే జీర్ణించుకోలేక కొంత మంది దాడులకు దిగే దారిని ఎంచుకుంటున్నారు ..ప్రజా స్వామ్యంలో తప్పులు చేసే వారికి అంత ఇది ఉంటే ప్రజలకోసమే పనిచేసే వారికి ఇంకెంత ఉంటుందో మరి…సమాజంలో ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించినప్పుడు అది సమాజ హితముగా ఉంటుందే తప్ప సమాజ శ్రేయస్సు కు విఘాతం కలగదన్న లోకోక్తి తెలుసుకుంటే మంచిగా ఉంటారనేది మేధావుల అభిప్రాయం…