Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఛీ.. ఛీ..సమాచార శాఖ అంటే ఇదేనా ..

ఛీ.. ఛీ..సమాచార శాఖ అంటే ఇదేనా ..

కాసులిస్తే అక్రిడేషన్లు ఇస్తారా
అర్హత ప్రామాణికం కాదా
డబ్బులిస్తే ఏదయినా చేస్తారా
విజ్ఞానం… పరిజ్ఞానం అక్కర్లేదా….
సమాచార శాఖ అధికారులకు డబ్బే ముఖ్యమా….
పబ్లిక్ రిలేషన్ అంటే పైసలు పంచుకోవడమా..
ఇన్ఫర్మేషన్ అంటే ఎలా దోచుకోవడం తెలుపుతారా ..
గ్రూప్ లో యాడ్ చేయాలంటే షరతులు ఉంటాయి..
నకిలీ లకు అక్రిడేషన్ ఇవ్వడానికి నిబంధనలు ఉండవా..
ఇంకెన్నాళ్లీ వీరి అరాచకం…
నకిలీ గాళ్లతో ఈ అవినీతి గాళ్ళు కుమ్మక్కైతే…

రామమోహన్ రెడ్డి,సంపాదకులు
ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరవేసి ప్రజలకు వారధిగా ఉండటానికి ప్రజా సంబంధాల శాఖ ఉండేది. కానీ ప్రతి నెల జీతాలు తీసుకుంటూ కూడా పంది కొక్కుల్లా తినడానికి పనికిమాలిన పనులు చేసి పబ్బం గడుపుకుంటూ ఉంటే వీరిని ఏమనాలి .ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైనది సమాచార శాఖ.జర్నలిజం లో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఏదయినా సరే ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన వి.కారణం ప్రభుత్వాల తప్పు ఒప్పుళ్ళను వివరిస్తూ ప్రజా చైతనన్యాన్ని తెప్పించి ప్రజలకు ఉపయోగ పడాలి. ఇందుకోసం ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను ఇస్తారు. అయితే అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టులని ఆకార్డు లేకపోతే జర్నలిస్టు కాదని ఎక్కడా లేదు..కానీ కొన్ని యాజమాన్యాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం జర్నలిస్టుల రూపంలో బిక్షగాళ్ల కంటే నీచమైన వారిని తీసుకుంటు న్నారు… వారి తీరు కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టిన చందన తయారు అయ్యి పనికి మాలిన వారిలాగా ప్రవర్తిస్తున్నారు అయితే ఇలాంటి వారిని కట్టడి చేసి అసలు ఎవరు నకిలీ ఎవరని గుర్తించి నకీలీల ఆట కట్టించాల్సిన సమాచార శాఖ అధికారులు అవినీతి కంపులో కూరుకుపోయి నకీలీలు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి అక్రిడేషన్ కార్డులు ఇస్తున్నారు.
పత్రికలు ఎవరైనా పెడతారు…పత్రిక నడిపే వారందరూ కూడా జర్నలిస్టులంటే సిగ్గుతో తలదించుకోవాలి.వక్రమార్గంలోనైన …సక్రమార్గంలో నైన ఓ పత్రిక తెచ్చుకోవడం వారొక పత్రికాధి పతి అని చెప్పుకోవడం అముసుగులో అక్రమాలు చేస్తుంటే ఇంకొంత మంది ఛానెల్ లో పెద్ద పెద్ద స్థాయి హోదాలు ఉన్నాయని చెప్పుకుంటూ తప్పుడు పనులు చేయడం పరిపాటిగా మారుతున్న వీరందరికి వంత పాడుతూ సమాచార శాఖ ఇంకా దిగజారి పోయిన స్థితిలో ఉండి పోతుంది.ఇప్పటికే ప్రధాన మీడియాలో సమాచార శాఖ అవినీతి కంపు కడిగిపారేస్తుంటే నిస్సిగ్గుగా తమ తప్పులను కప్పి పుచ్చు కొనే పనిలో ఉంది.గత ప్రభుత్వం లో అసలే వారే ఈ సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారేనని నమ్మించిన ఈ అవినీతి అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బైటకి వస్తుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందా అన్న మీమాంసకు పరిస్థితి దాపురించింది.మరి ఈ అవినీతి అధికారులను,వక్రమార్గంలో అక్రిడేషన్ పొందిన నకిలీలపై ఏమి చర్యలు తీసుకొంటారో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article