వి.ఆర్.పురం :జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 18వ తారీకు అనగా గురువారం నుండి మండలంలో సభ్యత్వాల కార్యక్రమంనీ ప్రారంబిస్తున్నామని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మూలకాల సాయికృష్ణ అన్నారు. జరగబోయే క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమం గురించి జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. అధ్యక్షులు సాయి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది లక్షలకు పైగా సభ్యత్వాలు జరగాలని, మరింత మంది జనసైనికుల కుటుంబాలను ఆదుకోవాలనే గొప్ప సంకల్పంతో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని, ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలైతే 50 వేల రూపాయలు వరకు మెడికల్ పాలసీ వర్తిస్తుందని, ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మన నాయకులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పార్టీలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగా వి.ఆర్.పురం మండలంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ లో జనసైనికులు, నాయకులు, వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి బాగుల అంజనరావు, కొత్తూరి శేషు, మండల సహాయ కార్యదర్శి ముంజపు శ్రీరామ్, మండల యూత్ నాయకులు ముంజపు సాయిరాం, వంశీ, నవీన్, పవన్ పాల్గొన్నారు.