ఒడిశా నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తికి సంబంధించి తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం సింగరేణి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 4 నెలల్లో నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని సూచించారు. నైనీ బ్లాక్ బొగ్గు తవ్వకాల నేపథ్యంలో అక్కడి నిర్వాసితులకు ఉపాధి కల్పించాల్సి ఉందన్నారు. నిర్వాసితులకు అర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలన్నారు.