Monday, January 20, 2025

Creating liberating content

క్రీడలుఇది కేవలం రూమర్

ఇది కేవలం రూమర్

సానియా మీర్జాతో పెళ్లి వార్తలపై మొహమ్మద్ షమీ స్పందన

టీమిండియా స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షమీ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో నిజం లేదని సానియా తండ్రి వివరణ ఇచ్చినప్పటికీ… ప్రతి చోట వీరి పెళ్లి ప్రస్తావన వస్తోంది. తాజాగా ఈ వార్తపై షమీ స్పందించాడు. శుభాంకర్ మిశ్రా అనే యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ ఈ విషయంపై మాట్లాడుతూ… సానియాతో తన పెళ్లి అనేది కేవలం రూమర్ మాత్రమేనని చెప్పాడు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని… ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడాన్ని ఆపేయాలని కోరారు. మీ సరదా కోసం ఇతరుల వ్యక్తిగత జీవితాలను, మనోభావాలను దెబ్బతీయకూడదని చెప్పాడు. మీమ్స్ అనేవి వినోదం కోసమేనని… అబద్ధాలను ప్రచారం చేయడం కోసం కాదని తెలిపాడు. వీలైతే మీ వంతుగా ప్రజలకు సహాయం చేయండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, అప్పుడే ఈ సమాజంలో మీరొక మంచి వ్యక్తిగా జీవించగలరని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article