Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలురెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం…సీఆర్డీఏ అధికారుల చోద్యం…

రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం…సీఆర్డీఏ అధికారుల చోద్యం…

అక్రమ లేఅవుట్..అప్పారావు నిర్వాహకం…
అయోమయం జగన్నాథం అంటున్న లబ్ది దారులు…
అవినీతి కోసం అక్కడ బలవుతున్న సామాన్యులు…
ఏది ఆక్రమమో…ఏది సక్రమ మో నిగ్గుతేల్చని పరిస్థితి…
లంచాలకోసం లాలూచీ పడతారా…
సామాన్యుల గోడు వినిపించదా…
ప్రభుత్వాలు మారినా అధికారుల తీరు మారదా …

రామమోహన్ రెడ్డి,సంపాదకులు
అవినీతి, అక్రమ సంపాదన,అనాలోచిత నిర్ణయాలు ఆపై అక్రమ కట్టడాలు వెరసి వందలాది మంది లబ్ధిదారులకు కంటినిండా నిద్ర లేకుండా పోవడం… ఏది సక్రమమో ఏది అక్రమమో తెలియక అనారోగ్యానికి గురికావడం ఇంటిల్లి పాది వేదనకు గురి అయితే ఈ అవినీతి అధికారులు ఆనందంలో వుండడం పరిపాటిగా మారిపోతుంది ఈ ఆధునిక సమాజంలో.ఇల్లు కట్టి చూడు,పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఆంటే జీవితంలో ఇవి రెండూ కూడా అత్యంత ముఖ్యమైనవి అత్యంత కష్టం తో కూడుకున్నవి.ఎంతటి పెడవాడైన…ఆర్ధిక స్థితిమంతుడైన సరే ఇల్లు అనేది ఓ కల.
ఆ కల ను సాధించుట కోసం నానా కష్టాలు పడి రూపాయి రూపాయి కూడబెట్టి కాస్త గూడు ఏర్పాటు చేసుకుంటారు.ఇదే ఇక్కడ కొంతమంది అవినీతి పరులకు నేతిలో విరిగి పడ్డాముక్కలాగా తయారుకావడం కొంత ఇబ్బంది కలిగిస్తోంది.అన్నీ అనుమతులు ఉన్నాయని ఆహా ఓహో అని పొలాలను చదును చేసిప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తారు.కొనుగోలు చేసిన వ్యక్తి తన ప్లాట్ వరకు మాత్రమే ఆలోచిస్తాడు.అందమైన రోడ్లు,పొడవు వెడల్పు ఇలా చూసుకుని మురిసిపోయి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించు కుంటాడు. ఇలా అనేకమంది రిజిస్ట్రేషన్ చేయించాక గాని తెలియదు అది అక్రమ వెంచర్ అని ,చివరికి పంచాయితీ కి ఇచ్చింది గుడి బడి కోసము ఇచ్చింది అంతా కూడా లోలోన అమ్మకాలు చేసేస్తారు .
ఇలా కొంత కాలం గడిచాక సమస్య మొదలు .ఉన్న స్థలం కంటే రిజిస్ట్రేషన్ ఎక్కువ అయ్యాయని ..ఆ తరువాత కానీ తెలియదు అధికారులు దళారులు వెంచర్ వేసిన వారి కక్కుర్తి, అవినీతి పనులు ఇంకేముంది కొన్నవారు తన్నుకు చస్తుంటే అమ్మినవారు హాయిగా కాలయాపన చేస్తూ అవినీతి అధికారులతో ఆమ్యామ్యా చేసుకుంటూ జీవిస్తున్న సంఘటన విజయవాడ భవనిపురం సర్వే నెంబర్ 421 గల 188 మంది కొనుగోలు చేసిన అప్పారావు ప్లాట్ లలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
ఏమిటీ ఆ గందరగోళం… ఎవరు దీనికీ కారకులు…అవినీతి అధికారుల పాత్ర ఎంత అనేది…
మరింత సమాచారం మరుసటి సంచికలో చూద్దాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article