Wednesday, November 27, 2024

Creating liberating content

రాజకీయాలుఅమ్మకానికే అక్షరాలు…

అమ్మకానికే అక్షరాలు…

➥అక్షరంతో పనిలేకుండానే అక్రిడేషన్..
➥సంపాదకులు అంటే సంపాదించుకోవడమవుతుంటే
➥సమాచారశాఖ ఉండేది సంచులు
నింపుకోవటానికేనా
➥అక్రమాలకు అడ్డాగా అక్రిడేషన్ ఇస్తుంటే…
➥నకీలీలను ప్రోత్సాహకాలు ఇస్తుంటే ..
➥జల్సాలకోసమే జర్నలిజం అవుతుంటే…
➥జర్నలిస్టు వెల్డర్ అవ్వచ్చు…
➥ఏలూరు ఉదంతం నామమాత్రమే…
➥వెలుగులోకి రాని ఉదంతాలు బోలెడు…
➥ఫ్రీలాన్స్ అంటే అర్థం తెలియని వాడికి కూడా…
➥కేసుల్లో ఉన్నా అక్రిడేషన్ లు…
➥పడుపు వృత్తిని కూడా వదలని వైనం…
➥తాపీ మెస్త్రీ కి స్టేట్ అక్రిడేషన్…

(రామమోహన్ రెడ్డి సంపాదకులు)
అక్షరాలను నమ్ముకుని అత్యున్నత స్థానంలో ఉన్నవారు ఎందరో ఉంటే అదే అక్షరాన్ని అమ్ముకుంటూ అవినీతి కంపులో దిగుతూ అనేక అక్రమాలకు పాల్పడుతున్న వారు కూడా నేడు తయారు అవుతున్నారు.అక్షరం విలువ తెలియని వాడు కూడా అక్రిడేషన్ పొంది సమాజంలో జర్నలిస్టుగా చెప్పుకుంటూ యర్నలిస్ట్ గా తయారై ఎన్నో అక్రమాలకు ఆజ్యం పోస్తూ ఉంటే ప్రజాస్వామ్యములో విలువలు అన్న పదానికి అర్థం లేకుండా పోతుంది. ఒకనాడు పేద ప్రజల మాన ప్రాణ రక్షణ కోసం ఆర్థిక రాజకీయ ఉగ్రవాదులు, సామంతులు వల్ల పీడించ బడుతున్న బలహీన వర్గాల కోసం నక్సలైట్లు అని రాడికిల్స్ అని పేర్ల లో తేడా ఉన్నా వారంతా తమ ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాటాలు చేసేవారు.
అడవుల్లో ఉంటూ ఆఖరికి అన్నము కాదుగా త్రాగటానికి మంచినీరు లేకపోయిన లక్ష్యం కోసమే జీవితాన్ని త్యాగం చేసేవారు. అలాగే అక్షరానికి కూడా అంతే విలువ ఉండటం తో అనేక మంది పాత్రికేయులు ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అయిన పరిస్థితి కుడా చూసాము.కొంతమంది పాత్రికేయులు సమాజ భాదితులు గా ఉండి పోయారు ఇప్పటికికుడా…కానీ నేడు అందుకు భిన్నమైన పరిస్థితి దాపురించింది ఈ సమాజంలో. ఇక్కడ అక్షరాన్ని నమ్ముకుని తాపీ పని చేయట్లేదు… తాపీ మెస్త్రీ అక్షరాన్ని ఆమ్ముతున్నాడు…అక్షరాన్ని నమ్ముకుని వెల్డర్ అవ్వలేదు…వెల్డర్ ఇక్కడ అక్షరాన్ని అమ్ముకుని జీవిస్తున్నాడు ..ఒక జ్ఞాని అక్షరాన్ని అమ్ముకోలేదు ..ఓ అజ్ఞాని అక్షరాన్ని నడి బజారులో వేలం వేస్తున్నాడు. ఓ విద్యావంతుడు జర్నలిస్టు అయితే అతనికి పాదాభివందనం చేయచ్చు… ఓ అక్షరాస్యుడు జర్నలిజం చేస్తే అక్షరం విలువ పెరుగుతుంది… కానీ ఇక్కడ నిరక్షరాస్యుడు,విద్యలేని వాడు వాడి పేరు వృత్తిని కూడా అక్షర రూపంలో కనబరచలేని వాడు జర్నలిజం ముసుగులో దూరి యూర్నలిజం చేస్తుంటే కట్టడి చేయాల్సిన అధికారులు చేష్టలుడిగి ఉన్నారు.
కారణం వీరందరి ద్వారా నీటిమాలిన పనులు చేయిస్తూ తద్వారా వచ్చే కక్కిన కూడుతో కడుపు నింపుకుంటున్నారు కాబట్టి. ఓకుర్రాడు ఉన్నత విద్యను అభ్యసించి కూడా ఉద్యోగం పొందే అవకాశం ఉండి కూడా జర్నలిజం లో ఉండే యర్నలిజం చూసి జర్నలిస్టుగా తయారు అయ్యాడు. పత్రికా సంపాదకుడు అంటే పత్రికను అమ్ముకుని పొట్టనింపు కోవడమే కదా అన్న అర్దాన్ని పరమార్థాన్ని విస్తరిస్తున్న మేధావి వర్గం తయారు అయ్యి నెలకు ఓ ఐదు వందలో ఓ వెయ్యో కొట్టి ఐడి కార్డు చేతబూని జర్నలిస్టు గా తిరుగుతూ యర్నలిజం కోసం వేటాడుతున్నాడు. అడవిలో ఆకలి కోసం పులి వేటాడినట్లు ఇక్కడ కూడా జర్నలిస్టు అనే ముసుగు వేసుకుని టీ స్టాల్ దగ్గర నుంచి మెడికల్ మ్యాఫీయా వరకు అక్రిడేషన్ పొంది తిరుగుతున్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి ఉండటమో లేక అలసత్వమో వల్లనో నకీలీల తయారీ ఎక్కువ అవుతుంది. Press అనే అక్షరాలు ఉంటే ఏ వాహనం కూడా ఆపలేకపోవడం ..నేను press అంటే కుర్చి వేసి కూర్చోబెట్టి కాఫీ టీ మర్యాదలు ఇవ్వడం చుసిన కొంతమంది ఇదేదో చాలా బాగుందని పోతే పోనీ 500 రూపాయలు, వెయ్యి రూపాయలు లేదా అక్రిడేషన్ కు 40లేదా 50 వేలు ఇచ్చి తెచ్చుకుని సమాజ హితం కోసం కాకుండా తన హితాన్ని మరిచి ప్రవర్తిస్తూ మనుగడ సాగిస్తున్నారు. అలా కాక పోతే విజయవాడ భవానిపురం పోలీసుల పేరు పెట్టి ఏకంగా స్టేషన్ పేరు పదే పదే ఉచ్చరిస్తూ సామాజిక మాధ్యమం ద్వారా భయంకర మైన ఓదుష్ప్రచారం చేసిన పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడిందంటే మరి మీడియా మాఫీయా ఏ మేర ప్రభావితం చేస్తుంటే వ్యవస్థ ల పై ప్రజలకు నమ్మకం ఎంతవరకు ఉంటుందో ఆలోచన చేయాలి. నిన్న ఏలూరు జరిగిన ఉదంతం చూస్తే చిన్న చేపలు బలి అయ్యాయి అసలైన సొర చేపలు తప్పించుకుని పోయాయా అన్న సందేహం కలుగుతోంది. కారణం పట్టుబడిన నకీలీల ఐడి లు చూస్తే నే అర్థం అయిపోతుంది.

జిల్లాకు డైరెక్టర్లు గా నియమించిన తీరు తెన్నులు ..వీరి వెనుక ఏలూరు వెల్డర్ నుండి నేషనల్ మీడియా గా అవతార మెత్తి అక్రమ మద్యం, నెలవారీ వసూళ్ల కోసం ఏసీ బస్సులు ఎక్కి విజయవాడ గుంటూరు చేస్తూ విహారయాత్ర విచ్చలవిడి తనాన్ని పాల్పడుతూ ఎవరైనా గుర్తుపడతారేమోనని ఎప్పుడూ వెంట్రుకలు లేకుండా జనాల నెత్తిన టోపి పెట్టడానికి టోపి వీరుడు కూడా ఉన్నారనే అనుమానం కూడా లేకపోలేదు ఎందుకంటే నాటి ముఖ్యమంత్రి అక్రిడేషన్ కోసం రాజ్యాంగములోని కొత్త జీవో నే వెలికితెస్తే ఆ జీవోను సైతం జేబులో పెట్టుకుని సమాచార శాఖ లో ఉన్న చెంచాగాళ్లకు చిల్లర ఇచ్చి ఇంకో నేషనల్ మీడియా చెప్పుకునే వాడితో సహాయాంతో ఇన్నిరకాలుగా చేస్తున్న ఆ వెల్డ్రర్ టు జర్నలిస్టు టు యర్నలిస్ట్ పాత్ర ఉందనేది కూడా వాస్తవం లేకపోలేదు…ఆఖరికి ఇలాంటి నకీలీగాళ్ళుస్పా ముసుగులో పడుపు వృత్తి చేసుకునే వారి వద్ద నుండి దోచుకోవడం ..వారిని అనుభవించడం నెల వారి మామూళ్లు తీసుకుంటూ ఉంటే అక్రిడేషన్ పొందిన నకీలీగాళ్ళు స్పా సెంటర్ నడుపుతూ పట్టుబడి పలు స్టేషన్ లలో కేసులు కుడా నడుస్తున్నాయి. వీరు కూడా జర్నలిస్టులేనండి బాబు… వారే ఈ సమాజంలో అత్యధికులుగా ఉన్నారు.కాల్ మని కేసుల్లో ఉన్న వారు జర్నలిస్టులుగా ఉంటే ఇంజెమానాలి. ఇవన్నీ కీడ4 పోలీసుల స్టేషన్లు లో కేసులు నమోదు అయినవి మాత్రమే… నమోదు కానివి ఇంకెన్నో…ఏది ఏమైనా సమాచారశాఖ ప్రక్షాళన, పోలీసులు ప్రేక్షక పాత్ర నుంచి బైటికి వస్తేనే గానీ నకీలీల ఏలుబడి తగ్గుతుందని భావించాల్సి వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article