Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుసమాచార శాఖకు చేస్టలుడిగాయా …సంచులు నింపుకున్నారా ..

సమాచార శాఖకు చేస్టలుడిగాయా …సంచులు నింపుకున్నారా ..

అంతా ఆ అధికారి చేతి వాటమేనా…
అందుకేనా ఆ చాంబర్ పోయింది…
నాడేందుకు అక్కడి దర్జా… నేడేందుకు ఇక్కడ డీలా
కక్కుర్తి పనులు బట్టబైలు అయ్యాయా. .
నకీలీల ప్రోత్సహించడంలో పెద్ద వాటాలే దక్కాయేమో…
వెటరన్,ఫ్రీలాన్స్, ఏజెన్సీ ఇంకా….
సిద్ధాంతాలు చెప్పడమేనా…పాటింపులు ఉన్నాయా…
సిద్ధాంతాలు ఉంటే ఈ పనులేల చేశారో…
ఈ అవినీతి అధికారులను ఇలానే వదిలేస్తారా…
ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఏం చేస్తాడో…
తొడల్లుడికి i&pr కార్డ్ ఇచ్చినందుకా…
ప్రజాభూమి పై ప్రెస్ క్లబ్ లో చర్చ కూడానా…
ప్రెస్ క్లబ్ పై వస్తున్న ఆరోపణలకు దిక్కులేదు…
అక్కడ పత్రికా విలువలపై సుదీర్ఘ చర్చలట.. ..
ప్రెస్ క్లబ్ వారేమైన ఉరి శిక్షలు వేస్తారా…
వేయచ్చుమో…వారే శాసన కర్తలు కాబోలు…
అయ్యోయ్యో ఎంత పని జరుగుతుంది ..
మరి ఇంకేమైనా చేస్తారా…చెయ్యచ్చేమో…

(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, ఆర్థిక స్వావలంబన కోసం,ప్రభుత్వాలు ఏఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి… ఏఏ పథకాలు అమలు కు సిద్ధం అవుతున్నాయి అనేది మారుమూల ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రసార మాధ్యమాలను ఉపయోగించి సమాచారాన్ని చేరవేసేందుకు సమా చార శాఖ ఒకటి ఏర్పాటు చేశారు.అయితే ఈ సమాచార అధికారులు గతంలో చాలా వరకు వృత్తి ధర్మాన్ని పాటించే వారు.కాల క్రమేణా మీడియా పెరిగి పోయి పోటీ తత్వాన్ని వదిలి రాజకీయ నాయకులు పంచ చేరడంతో సమాచార శాఖ తమ అవినీతి జులుం ప్రదర్శించడం మొదలు పెట్టి మీడియా లో ఉన్న కొంత మంది అవినీతి పరులకు చెంచాలు గా మారి చేస్తున్న వృత్తిని కూడా తాకట్టు పెట్టె స్థాయికి దిగజారి పోయారని సందేహం అక్కర్లేదని చెప్పాలి. దీనికి తోడు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాకాంక్షకు పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు పనికిమాలిన పనులకు దిగజారి పోవడంతో ప్రభుత్వ అధికారులు కూడా ఇంకా దిగజారి పోతున్నారు.ఓ శాసన సభ్యుడు తన వ్యక్తిగత పనులు ,చెంచాగిరి చేయించుకోవడానికి ఏకంగా రాష్ట్ర స్థాయి అక్రిడేషన్ తన డ్రైవర్కు తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఓ ఎలక్ట్రానిక్ మీడియా కు ఏపీమొత్తం నాదే అని చెప్పుకు తిరుగుతున్న మేధావి తన తొడల్లుడికి స్టేట్ అక్రిడేషన్ ఇప్పిస్తే ఆ నకిలీకి బీల్డింగ్ ల దగ్గర మామూళ్ల వసూళ్ల కోసం లైసెన్స్ ఇచ్చినట్లు అయింది. అదే సంస్థ లో పనిచేసిన ఇంకొక మేధావి తన కుమారుడి కి కూడా అక్రెడిషన్ తీసుకున్నారు. వీరందరికి ఆ సంస్థ సిఫార్సు చేసిందా అంటే ఉదయం లేచింది ఆరు సూత్రాల పేరుతో ఆ అక్షరం పేరుతో అలుపెరుగని నీతి మాటలు వల్లిస్తూ ప్రజలకు బాగోగులు చెపుతుంటారు…వారికి గురివింద సామెత వర్తించనట్లుంది మరి. ఇలా అవినీతి సంస్థలతో కుమ్మక్కైన సమాచార శాఖలో ఉన్న కొంతమంది అవినీతి పరులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి కాసులకోసం కక్కుర్తి పడి అడ్డదారీలో అక్రిడేషన్ కార్డులు పప్పులు బెల్లాలాగా పంచిపెట్టారు.కొత్త బిక్షగాడు ప్రొద్దు ఎరగడు అన్న చందానా నాటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం కూడా మార్చేసే అవినీతి అనకొండలు ఉన్నాయన్న కనీస అవగాహన లేకుండా మీడియా అక్కసుతో కొత్త జీవో తీసుకొచ్చి నానా తంటాలు పడ్డ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తప్పుడు పనులునో వైపు చేస్తే అరే ఎక్కడో pib నుంచి డిప్యుటేషన్ మీద వచ్చి ఇంత చేస్తే మేమేమి అయి పోవాలని నీకంటే మేమేమి తక్కువ కాదంటూ ఓ ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేసి గతంలో ఓ మూల చాంబర్ లో ఉన్న అధికారి నీకింత నాకింత అని దోచుకోవడమే పనిగా కనీస అవగాహన, అర్హత లేని వారికి వెటరన్,ఫ్రీలాన్స్, స్టేట్ అక్రిడేషన్ కార్డులు ఇచ్చి అయోచిత లబ్ది పొంది పబ్బం గడుపుకున్నారు.కడుపు మండిన రియల్ జర్నలిస్టులు జగన్ పై ప్రతీకార కక్షతో సార్వత్రిక ఎన్నికల్లో కలం పోటు ను చుపించారు. ఇక్కడ పోయింది జగన్ పరువు మాత్రమే. నీతిమాలిన అధికారులు ఏముంది మళ్లీ తమ సీట్లు మార్చుకుని హాయిగా ఉంటారు ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో వారి ఉద్యోగం పోదు గా…పోయేది ప్రభుత్వాల పరువు..ఆ ప్రభుత్వాన్నీ నడిపించే నాయకుడు సంకనాకిపోతారు… ఇన్ని తప్పుడు పనులు చేసి చేసేందుకు ప్రోత్సహించింది కాక వాస్తవాలు ఆధారాలతో సహా పిర్యాదు ఇచ్చిన స్పందించక పోగా ప్రజాభూమి కథనాలపై ఓ తప్పుడు మేధావి తో చర్చలు… కూడాను…చేసేది శివపూజ వెళ్ళేది … అన్న చందంగా ఈ తప్పుడు మేధావి జర్నలిజం లో ఓ నామాలు రాక ఏదో వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న వ్యక్తికి i&pr లో స్టేట్ కార్డ్ అదికూడా రిపోర్టర్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ అంట కార్డు ఇప్పిస్తే అది పట్టుకుని ఎక్కడ రూపాయి వస్తుందో వెతకటం మొదలు పెట్టాడు ఆ కార్డ్ తీసుకున్న జర్నలిస్ట్ ముసుగులో ఉన్న యర్నలిస్ట్.ఇక ఇలాంటి మేధావి తో చర్చిస్తే ప్రజాభూమి ని మూయిస్తారా…లేక ఉరిశిక్ష ఏదయినా వేస్తారా…అన్నది డాలర్ల ప్రశ్న గా మారింది. ఈ చర్చలకు ప్రెస్ క్లబ్ వేదిక కావడం ఓ సంచలనం… మొదటి దేవుడికే లేక మొత్తుకుంటుంటే ఆఖరి దేవుడు వచ్చి ఆకుపూజ కావాలని అడిగిన చందంగా ప్రెస్ క్లబ్ పై గబ్బు గబ్బు గా కథనాలు రావడం .టీ సిగరెట్లు అంటూ విమర్శలు రావడం…రాత్రి అయితే అక్కడ రాచ కార్యాలు ఉన్నాయంటూ బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతుంటే వయస్సు పెరిగిన యూట్యూబ్ సబ్స్క్రయిబర్స్ ఎలా పెంచుకోవాలో తెలియని వారితో ఇలాంటి నేరాలు ఘోరాలు గురించి మాట్లాడితే వారు ఏమి చేస్తారో మరి చూడాలి. ఆఖరికి జర్నలిజం లో యర్నలిజం రుచి చూసి వెల్డర్ టు జర్నలిస్టు అయి ఏలూరు జిల్లా చేయరాని పనులు చేసి జైలుకు వెళ్లి వచ్చికూడా అనేక నెరమయ సంఘటన ల లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామ్యం ఉన్న నకిలీ నేషనల్ అక్రిడేషన్ జర్నలిస్టు భవానిపురం ఓ బిల్డింగ్ దగ్గర అసెంబ్లీ పాసు,నేషనల్ అక్రిడేషన్ అన్ని చూపిస్తే 500 రూపాయలు ఇస్తే ఆవేశంతో ఊగిపోయి పీకేదేమి లేక పర్సులో పెట్టుకుని అక్కడ నుంచి ఉడాయించిన ఉదంతం చోటుచేసుకుంది. మరి ఇలాంటి జర్నలిస్టుల ముసుగులో దూరి యర్నలిస్ట్ గా మారిన దొంగలు గురించి వాస్తవాలు వెల్లడి చేస్తే ప్రజాభూమి తప్పు చేసినట్లు ఈ నకీలీగాళ్ళు మంచి వారు అయినట్లే నా.. అంత ప్రేమ సమాచార శాఖ లో ఒకరికి ఒకరు తొత్తులుగా ఉన్న వీరికి ఉంటే సమాచార శాఖలోని అవినీతి కంపును కళ్ళకు కట్టినట్లు చూపించిన మహా న్యూస్,టీవి5 ఇతర శాటిలైట్ ఛానెల్స్ కూడా మూయించి వేస్తారా ఈ అపర మేధావులు.. లేక ఆ సంస్థలు అడ్రెస్ లేకుండా చేస్తారా..ఈ అపార అనుభవం కలిగిన జర్నలిస్టులు…ఒక్కొక్కొటిగా బైటికి వస్తున్న నకీలీల భాగోతం చూసి సిగ్గుతో తలదించుకోవాలే తప్ప అక్షర జ్ఞానం లేక కనీసం నేర్చుకోవాలన్న అభిలాష లేని వ్యక్తులను ప్రోత్సహించే వారున్నంత వరకు ఇలానే విమర్శలు వచ్చిపడుతుంటాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article