Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఅయ్యా ధ్యానచంద్ర గారు..కొంచెం ధ్యాస పెడతారా…

అయ్యా ధ్యానచంద్ర గారు..కొంచెం ధ్యాస పెడతారా…

అబ్బో..మీమున్సిపల్ శాఖాఅంటే మజాకానే…
అక్రమ నిర్మాణాలపై చర్యలేమిటో తెలుసా…
బిల్డింగ్ ఫోటో,డోర్ నెంబర్,వీధి, లొకేషన్ ఇవ్వాలి సుమా…
మనవాడు అయితే ఒక రేటు…ఇంకొకరు అయితే రూటే సపరేటు…
అయితే కార్పొరేటర్ లేదా అధికార పార్టీ అరంగ్రేటం…
అంతకు మించితే కూల్చివేతే..
కూల్చివేతంతే పెచ్చులు పీకడం…
పెచ్చులు పీకేస్తే బిల్డింగ్ మొత్తం కూలిపోవాల్సిందే…
ఈ మాయాజాలం బెజవాడ కార్పొరేషన్ వారికే తెలుసండి…
నోటీసులు ఇస్తూనే ఉంటారు…కట్టడాలు కడుతూనే ఉంటారు…
ఏసీపీ బిజీ,టీపీఓ ఇంకా బిజీ,బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఇంకా బిజీ…
వామ్మో క్షణం తీరిక లేదు పాపం వారికి..
అక్రమ నిర్మాణాలు కూల్చుడే..కూల్చుడు…
సిగ్గుతో తలదించుకోవాలి వీరు,వీరి పనితీరు చూసి…
కాసులు కోసం ఇంత కక్కుర్తి నా మరి…
వీరి తీరుతో తలలు పట్టుకుంటున్నారు బిల్డింగ్ విలేకరులు..
నైరాశ్యంలో ఏలూరు, కృష్ణా గుంటూరు, తాడేపల్లి గూడెం పాత్రికేయులు..
బ్రేకింగ్ విలేకరి అయితే బిత్తరపోతున్నాడు…
నేషనల్, అసెంబ్లీ పాసు ఉన్నా 500 వందలేనట …
అవినీతి అధికారులు ఎంత పని చేస్తున్నారో…
ఛీ..ఛీ..ఏమిటీ ఇలా…

రామమోహనరెడ్డి, సంపాదకులు

ఫక్కున నవ్వుతోంది ప్రజానీకం. పరువు పోతుంది పాచిపోయిన ,పేరుకుపోయిన అవినీతి ,పట్టణ ప్రణాళిక శాఖ లోని పద్ధతులు లేని తీరు చూసి.ఆచ్చర్య పడుతున్నారు అక్రమ నిర్మాణాలపై అవినీతి అధికారులు తీసుకునే చర్యలు దుచ్చర్యలు ఈ అధికారుల దుర్మార్గాన్ని చూసి.ఈ విధానాలు చూసి కంగుతినాలో కల్లుతాగాలో తెలియక కకావికలం అవుతున్నారు నకిలీ కార్డులు తీసుకుని బీల్డింగ్ లపై ఆధారపడి జీవిస్తున్న కల్తీ నాయళ్లు.ఇంతకీ ఏమిటీ ఈ భాగోతం అనుకుంటున్నారా…అయితే చదవండి…నవ్యాంధ్రప్రదేశ్ లో రెండవ కార్పొరేషన్ బెజవాడ.అయితే బెజవాడ కార్పొరేషన్ లో సహజంగానే అవినీతి పేరుకు పోయి మురికికంపు కొడుతున్న సంఘటణలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్పొరేషన్ లో అనేక విభాగాలు ఉన్నాయి.ఇందులో ప్రధానంగా పట్టణ ప్రణాళిక విభాగంలో బిల్డింగ్ విభాగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


ఎలా అంటే పట్టణ అభివృద్ధి లో భాగంగా ప్రతిరోజు నగరంలో బిల్డింగ్ నిర్మాణాలు ఏదో ఒక ప్రాంతంలో చేపడుతూనే ఉన్నారు.అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ప్రతి నిర్మాణదారుడు అనుమతులకు మించి తన స్థాయిని బట్టి నిర్మాణాలు చేపడుతున్నారు.ఇందులో మున్సిపల్ ఉద్యోగులు సైతం మినహాయింపు లేదు.అయితే తమ్ముడు తనవాడైన ధర్మం ఒకటే అన్న నీతి సూత్రాన్ని అవినీతిలో చక్కగా వాడు కొంటున్నారు మున్సిపల్ అధికారులు.
ఈ నేపధ్యంలో మీడియా లో కూడా అవినీతి అరికట్టేందుకు వీలుకాని, సాధ్యపడని స్థాయిలో రెచ్చిపోతుంది. మున్సిపల్ ఉద్యోగులే నకిలీ మీడియాతో చేతులు కలిపి అక్రమ నిర్మాణాల దగ్గరికి పంపించడం బిల్డింగ్ యజమానులతో ఒప్పందానికి రావడమా…లేక పోతే నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడం ఆపై ఆమ్యామ్యా చేసుకోవడం ఇది నీకు ఇది నాకు అని వాటాలు పంచుకోవడం పరిపాటిగా మారింది.గత ప్రభుత్వ హయాంలో అయితే స్థానిక కార్పొరేటర్లు ప్రవేశించి వారుకుడా ఇప్పుడు జరుగుతున్న లోకొత్తర ధర్మాన్ని అంటే వాటాల ధర్మాన్ని అనుసరించి మీడియాకు ఇంత వారికి ఇంత అని వాటాలు పంచుకుని ముగిసేది ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది ఇది యదా రాజా తదా ప్రజా అన్న చందంగా తయారై నది.అయితే ఇప్పుడు మీడియా మితి మీరి పోవడం కేవలం జర్నలిజం లో ఉన్న యర్నలిజం ను చూసి చీ ఆఖరికి తాపీ మెస్త్రీ లు,బిర్యానీ హోటల్ వారు,పెయింటర్లు,వెల్డర్లు ఇలా జర్నలిజం లో ఓనమాలు రానివారు, జర్నలిజం అని తెలుగులో కానీ ఇంగ్లీష్ లో రాయలేని మహనీయులు, పనిచేసేది నేషనల్ అంట బిల్డింగ్ దగ్గర చూపించేది మరో సంస్థ ఐడి కార్డ్, అక్రిడేషన్ ఉండేది ఇంకొక సంస్థ ఇలా కొంతమంది తయారై బిల్డింగ్ అక్రమాలపై నిత్య శోధన చేస్తున్నారు. ఈ క్రమంలో బిల్డింగ్ యజమానిని ముందు ఓ లచ్చ అడుగుతారు,ఆ తరువాత కుదిరితే ఐదువేలు లేక పోతే ఐదువందలతో సరిపెట్టుకుంటున్నారు.
ఇందులో వెల్డర్ టు నేషనల్ మీడియా అయితే 250 రూపాయలతో కూడా సరిపెట్టుకోవాల్సింది వస్తుంది. అసెంబ్లీ కి వెళ్లి ఒక్క వార్త రాసింది లేదు. అసలు ఆ సంస్థ ఉందొ లేదో కూడా తెలియదు అయినా అడ్డదారీలో అవినీతి అధికారులతో కుమ్మక్కై అక్రిడేషన్ లు పొంది బిల్డింగ్ పై దండయాత్ర చేస్తూ జీవిస్తున్నారు.ఇక్కడ రూపాయి కూడా ఇవ్వకుండా పోతే వెంటనే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కు బిల్డింగ్ ఫోటో,లొకేషన్, డోర్ నెంబర్ లు పెడితే హడావుడి గా వచ్చి అక్రమ నిర్మాణాలపై పై పెచ్చు పీకి ఫోటోలు పెట్టి అక్రమ నిర్మాణాలు కూల్చి వేశామని ప్రకటన లు ఇస్తే ఈ నకిలీ గాళ్లు అబ్బో నేను తలుచుకుంటే కమిషనర్ ను పిలిపిస్తా అని బడాయి మాటలు చెప్పుకునే నీచ స్థితికి దిగజారిపోయారు. టే
అయితే బెజవాడ కార్పొరేషన్ బిల్డింగ్ అక్రమాలు రుచికరమైనవి గా భావించి ఏలూరు,గుడివాడ, తాడేపల్లి గూడెం,గుంటూరు ఇలా వలసల తాకిడి ఎక్కువయింది.ఇదంతా కూడా కేవలం కార్పొరేషన్ లో అవినీతి అధికారులు చేతి వాటంతో నకీలీగాళ్ళు నాట్య మాడుతుంటే బిల్డింగ్ యజమానులు కొందరు బెంబేలెత్తుతుంటే మరికొంత మంది బిల్డర్ లు భూతుపురాణాలు,మరికొంతమంది అయితే వెంబడించి కొట్టడం జరుగుతుంది. తాదిగడప డొంక రోడ్లు లో ఓ వృద్ధ విలేకరి,మరో విలేకరి కి దేహశుద్ధి చేసిన సంఘటన ఇటీవలే చోటు చేసుకుంది. కొత్తగా కమిషనర్ బాధ్యతలు తీసుకున్న ద్యానచంద్ర అయినా కొంచెం ధ్యాస పెట్టి ఈ దరిద్రాన్ని తొలగిస్తారా ఆయన కూడా అయ్యా ఎస్ లకే ఆ అంటారా చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article