Thursday, November 28, 2024

Creating liberating content

Uncategorizedపరిశోధనలతో సమాజానికి మేలు

పరిశోధనలతో సమాజానికి మేలు

రామచంద్రపురం :సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు నిర్వహించాలని ఇండో- జెర్మన్ సైన్స్ & టెక్నాలజీ సెంటర్, న్యూఢిల్లీ చీఫ్ సైంటిఫిక్ ఆఫిసర్ డా. పి.వి. లలిత అన్నారు. బుధవారం రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలో ఉన్న సెవెన్ హిల్స్ ఫార-శీ కళాశాలలో ” ఫార్కాస్యుటికల్ రీసెర్చ్ ఫండింగ్ : బిల్డింగ్ సక్సెస్ఫుల్ పార్టనర్షిప్ 2 ఇన్నోవేషన్, ఎక్సెలెన్స్ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ” అనే అంశం పై ఒక రోజు అంతర్జాతీయ వరఃషాప్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పద్యావతి మహిళ్ళా పాలిటెక్నిక్ కాలేజ్ ఫార్మసీ అధిపతి డా. యం. పద్మావతమ్మ, మరియు గౌరవ అతిధిగా తిరుపతి -వెఐటి మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొ. యం. రవిశంకర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా హాజరైన -పి.వి. లలిత మాట్లాడుతూ. పరిశోధనలు నాణ్యతతో కూడినవి ఉంటే అవి సమాజానికి ఎంతో ఉపయోగపడుతాయని, పరిశోధనలు చేయటకు వివిధ సంస్థలు ఫంకింగ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తాయిని తెలిపారు ఈ కార్యక్రమంలో డా. పద్యావతమ్మ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రయోగాలు, పరిశోధనలు ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా ప్రొ. యం. రవి శంకర్ మాట్లాడుతూ సూతన ఆవిష్కరణలతో కొత్త ఔషధాల అభివృద్ధి సులభతరమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యం. సిరంజన్ బాబు మాట్లాడుతూ కృత్రిమ మేధ, డేటా అనలెటిక్స్ వంటి డిజిటల్ టెక్నాలజీలు పరిశోధనలలో కొత్త మార్పులను తీసుకువస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ యం సుమలత, బోధన సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article