పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు చెందిన 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్‌లో కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. శుక్రవారం 57 కిలోల విభాగంలో జరిగిన కాంస్య పోరులో 13-5తో ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్ టోయ్‌ను మట్టికరిపించి పతకాన్ని సాధించాడు. ఈ పోటీల్లో భారత్ తరపున పోటీపడిన ఏకైక పురుష రెజ్లర్ కూడా అమనే. 21 ఏళ్ల వయసులోనే దేశానికి పతకాన్ని సాధించిన ఈ యువ కుస్తీ వీరుడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా అమన్‌ను ప్రశంసించారు. భారత్ తరఫున అత్యంత చిన్న వయసులో పతకం గెలిచిన అమన్ సెరావత్‌కు అభినందనలు. ఇది మీ విజయం మాత్రమే కాదు, మొత్తం భారత రెజ్లింగ్‌ది. ప్రతి భారతీయుడూ మీ విజయం పట్ల గర్విస్తున్నాడు. మీ తల్లిదండ్రులు స్వర్గం నుంచి నిన్ను చూస్తూ ఖచ్చితంగా గర్వపడుతుం