ప్రజాస్వామ్య పరిరక్షణ ఉందని నమ్మాలా…
అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ కు మూలం ఎమిటీ..
ఈ ప్రజాస్వామ్యాన్ని అసలు కూని చేస్తున్నదేవరు…
మీడియా వ్యవస్థ ఇన్నింటిని ప్రభావితం చేస్తుంటే…
నాలుగో స్తంభం నీతి తప్పిపోయిందా….
రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు నొక్కుతోందా..
లేక నాలుగో స్తంభమే నడివీదిలో నాట్యమాడుతుందా..
చేష్టలుడిగి సిగ్గువిడిచి గతి తప్పుతోందా…
అసలు వదిలి నకీలీల కి ప్రాధాన్యాత ఇవ్వడమేమిటీ…
ఇదేనా అధికారుల చిత్తశుద్ధి ..
ఇప్పుడున్నది జర్నలిజమేనా…
జర్నలిజమే అయితే ఇంత దిగజారి ఎందుకు పోయింది…
జర్నలిజంను యర్నలిజం…బ్రోకరిజం..బ్లాక్ మెయిలిజంగా మార్చిందెవరు…
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్టబడుతోందా…నెట్టవేయబడిందా…లేక నెట్టి వేయడానికే సిద్ధంగా ఉన్నారా అంటే అవుననే చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది .సమాజానికి అవసరమైన వ్యవస్థలు ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నాయా లేక ప్రజాస్వామ్యాన్ని భక్షించడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయా అంటే నిజమే నన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అసలు ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థను కూల్చి వేస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అందుకేమో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పిదప రాజకీయ ,అధికార ,పార్లమెంటరి విధానాలతో విసిగి వేసారి పోయిన ప్రజలు ఒకనాటి ఆంగ్లేయులు పాలనను గుర్తుతెచ్చుకొంటారని ఆనాడే చక్రవర్తి రాజగోపాలచారి చెప్పింది నిజమేనని అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ప్రస్తుత సమాజంలో వినిపిస్తోంది. అందుకు గల కారణాలు లేకపోలేదు.ప్రజలను ఉద్ధరించడానికే చట్టాలు ఉన్నాయని చెప్పుకోవడానికే తప్ప ఆచరణలో చిత్తశుద్ధి లేకపోయింది. చట్టాలు అమలుకు కీలకమైన ఆదేశాలు ఇవ్వాల్సిన వ్యవస్థ చేష్టలుడిగి ఉండి పోక తప్పడం లేదు.ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటే ఈ ప్రజాప్రతినిధులు తమ కడుపు నింపు కోవాడానికే పరిమితము అవుతూ సమాజానికి మూలమైన వ్యవస్థ లలో ఒక న్యాయవ్యవస్థను కొంత మినహాయింపు ఇస్తే మిగిలిన అన్ని వ్యవస్థలను తమ అరిపాదాల కింద పెట్టుకున్నారా అన్న విధానానికి ప్రజలు ఆలోచించే స్థాయికి తీసుక వచ్చారు. దీనికి కారణం సమాజంలో ఏ స్తంబానికి హానీ జరిగిన అండగా ఉండి ప్రజా చైతన్యం తీసుక రాగలిగిన నాలుగో స్తంభం నడివీదిలో అంగడి సరుకుగా మారింది. ఇందులో వాస్తవం లేక పోలేదు.కులం, మతం వారిగా విడిపోయి తమ ఆర్థిక ప్రయోనాల కోసం అర్రులు చాచుతూ అడగకుండానే రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తున్నాయి. మితి మీరిన ధనదాహం.దానికి తోడు ఈప్రజల్ని శాసించగల సత్తా తమకే ఉండాలన్న కులజాడ్యపు అహంకార ఘీంకారా బలుపు. అలా కాక పోతే మీడియా పాత్ర ఏమిటీ,మీడియాను సమ సమాజం సక్రమంగా నడవడానికే నాలుగో స్తంభం ఉండేది. తప్పు చేస్తే మీడియా ప్రజాక్షేత్రంలో ఎండగడితే మనుగడ కష్టమవుతుందన్న భయం ఉండేది.ఇప్పుడు అదే మీడియా తన విలువలను దిగజార్చు కుంటుంటే మిగిలిన వ్యవస్థలు హాయిగా నవ్వుకుంటూ నట్టనడి వీధిలో నాకెవ్వరు అడ్డులేరన్న ధోరణి కి వచ్చేసాయి.అక్షర జ్ఞానం లేని వెల్డర్ లు తాపీ మెస్త్రీలు, చెక్క పనిచేసేవారు జర్నలిజం లోకి దూరి యర్నలిజం రుచిమరిగి విచ్చలవిడిగా తిరుగుతూ జేబులు నింపుకుంటున్నారు వెల్డర్ టు జర్నలిస్టు టు యర్నలిస్ట్ అయి నేషనల్ మీడియా అని అడ్డదారి దారిలో అక్రిడేషన్,అసెంబ్లీ పాసు పొంది అందిన కాడికి దోచుకునే ఏలూరు వెల్డర్ జర్నలిస్టు తీరు చూస్తే పాత్రికేయ వృత్తి లో ఉన్నామా లేక ఇంకేమైనా చేస్తున్నామ అనే సందేహం కలుగుతోంది.గడిచిన గంటల్లో మాజీమంత్రి జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అయ్యి పుట్టెడు ఆవేదనతో ఉంటే ఈ యర్నలిస్ట్ జోగిరమేష్ లీలలు అని ఆ కేటుగాడు ఏర్పాటు చేసుకున్న గ్రూప్ లో వేస్తే ఈ కేటుగాడికి నకిలీ అక్రిడేషన్ ఇప్పిచ్చిన ఇంకో నేషనల్ మేధావి డిలీట్ చేసాడు.ఇది వీరి బ్రతుకులు. ఇలాంటి దౌర్భాగ్యపు వ్యక్తులు జర్నలిజం లోకి వచ్చి కులం, మతం అడ్డుపెట్టుకుని దోచుకుంటున్న అధికారులు చేష్టలుడిగి ఉన్నారా లేక ఇంకేమైన నా అన్న ధర్మ సందేహం కలుగుతోంది. …ఇంకా ఉంది…