Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలులేచింది… నిద్రలేచింది మహిళా లోకం…

లేచింది… నిద్రలేచింది మహిళా లోకం…

దద్దరిల్లుతోంది రైస్ మిల్లర్ల అసోసియేషన్…
అర్థరాత్రి ఒంటరి గా ..జంటగా జంకు లేకుండా…
అక్రమ బియ్యం వ్యాపారులే లక్ష్యంగా…
అడిగినంత ఇవ్వాల్సిందే… లేదంటే అల్లరే అల్లరి…
అందమైన ఐడి కార్డులుంటాయి
ఆ సంస్థలు ఎక్కడుంటాయో మరి…
ఈ ఆడవారి వెనుక ఉన్నది అంతా పెద్దమనుషులే…
వారంతా సంక్షేమం కోసమే కృషిచేస్తున్నట్లు…అంతే…
ఇక్కడ ఎవరి సంక్షేమం అంటే అది ఉ..ఉ..నే..
అందరూ జర్నలిస్టులే…అక్షరం రాకపోయిన…ఆర్భాటం చూస్తే అదుర్స్ ..
అక్షరాలు రాయమంటే ఇక అంతే…
అర్ధరాత్రిలు అక్రమాలు చేయడానికి అక్రిడేషన్ లు…అసెంబ్లీ పాసులు ..
వీరి కక్కుర్తి ఎలా అంటే కన్న కొడుకులు కూడా నాయకులే..
పొట్ట కొస్తే అక్షరం రాదు..జల్సాల కోసం ఇలా…
ఏలూరు గోదావరి జిల్లాల నుంచే వలసలు
ఉమ్మడి గుంటూరు,ఉమ్మ్మడి కృష్ణా జిల్లాల్లో నే ఇలా…
కులం కూటమి తో నే ముఠా
ఏలూరులో చెల్లక బెజవాడ, గుంటూరుకు పయనం…
ఫ్యామిలీ ఫ్యాకేజీ లు కూడా ను…
ఛీ..ఛీ..వీరితో జర్నలిస్టుల సంక్షేమము సాధ్యమా…
నేషనల్ మీడియాను నడి వీధిలో వేలం వేస్తుంటే…
మళ్లీ వీరు తలుచుకుంటే గల్లంతే నట…
వీరి అక్రమాలు తెలియపరిస్తే అడ్రెస్ లు వెతుకుతారా…
హరిశ్చంద్రులే అయితే అక్షరంలో చూపించొచ్చు గా…
అక్షరం ముక్కరాదు ఆర్భాటం ఏల…
అక్షరం శాస్వితం.. మీ అడ్డగోలు అశాస్వితం..
మీ బండారం బైట పడితే..మీ బ్రతుకులు ఎలా…
దోచుకుని దాచుకోవడమేనా మీ పని…
ఇదేనా మీ చిత్త శుద్ధి…

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
ఆడది అబల కాదు..అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్ర్యం సిద్దించినట్లు అని ఆనాడు జాతిపిత మహాత్మ గాంధీ అన్నారు.దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత దేశ వర్తమాన కాల పరిస్థితి కూడా మెరుగు పడుతూ స్త్రీ జాతి కూడా అన్ని రంగాల్లో ఆధిక్యత చూపిస్తూ అవని నుండి అంతరిక్షం వరకు అత్యున్నత ప్రతిభా పాఠవాలు చూపిస్తూ రాణిస్తున్నారు.పురుషుల కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తున్న ఇంకా మహిళలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు.కారణం మగవాడి అహంకారం ,అనాలోచిత నిర్ణయాలు, స్వార్థం, కామం ఇలా అనేక రకాలుగా చెప్పవచ్చు.
అయితే ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పక తప్పడం లేదు.దేశంలో అనేక రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు.సమాజానికి మూల స్తంభమైన జర్నలిజంలో కూడా అత్యంత ప్రావీణ్యం చాటుతున్నారు. అయితే ఇక్కడే ఓ సమస్య మొదలైంది. జర్నలిజం లో డిగ్రీ లు, లేదా అనుభవం పొంది రిపోర్టర్, యాంకర్, అనలిస్ట్, ఇన్వెస్టిగేషన్ ఇలా అనేక రకాలుగా రానిస్తుంటారు.కానీ బెజవాడ కేంద్రంగా అందుకు విరుద్ధంగా జరుగుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.అక్షర జ్ఞానం లేక కొందరు,అక్షర జ్ఞానం ఉన్నా అక్షరాలు రాయడానికి కనీసం పిడిఎఫ్ కూడా లేని పత్రికలు, సైకిల్ ట్యూబ్, లారీ ట్యూబ్, abcdef…123456 …ఇలా అంకెలు జోడించి వందలు వేల సంఖ్యలో యూట్యూబ్ ఛానెల్స్ పుట్ట గొడుగుల్లా వెలసి జాతీయ, రాష్ట్రస్థాయి లో ఐడి కార్డు లిచ్చి దోచుకోవడమే పనిగా రంగంలోకి దింపారు కొందరు యూట్యూబర్ లు. ఇంకేముంది గుండమ్మకథ సినిమాలో లాగా లేచింది నిద్ర లేచింది మహళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్న చందానా అక్రమ రైస్ మిల్లర్లపై దాడి కి అర్థరాత్రి అపరాత్రి లేకుండా పైసా వసూల్ అంటూ తిరిగేస్తున్నారు.
ఇక పోతే నిత్యం జర్నలిస్టుల సంక్షేమమే మా ద్యేయం అని చెప్పుకుంటూ భూటకపు మాటలు, బడాయి వేషాలు వేస్తున్న కొంతమంది యూనియన్ నేతల బ్రతుకు దెరువు కోసం కుటుంబ సభ్యుల ను యూనియన్ లీడర్లు గా చేస్తే ఇంకొక అడుగు ముందుకు వేసి ఏకంగా మహిళా జర్నలిస్టుల ను తయారు చేసి ఏది అక్షరాలు రాయడానికి, యాంకరింగ్,రిపోర్టింగ్ చేయడానికి కాదండి… కలెక్షన్స్ కోసం ఐడి కార్డులిచ్చి తిప్పుతున్న ఉదంతాలు ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలలో చోటు చేసుకుంటుంటే మేమేమి తక్కువ కాదురా అయ్యా అంటూ అడ్డదారీలో గడ్డితినే అధికారులను అడ్డుపెట్టుకుని నకిలీ అక్రిడేషన్ పొంది ఏలూరు ఏసీ బస్సెక్కి అడుక్కోవడం, బెదిరింపులు, బీల్డింగ్ లు,సబ్ రిజిస్ట్రార్, రవాణా శాఖ, అక్రమ రేషన్ దారుల వద్దకు వెళ్లి ఒకటి కులం,రెండు నేషనల్, మూడు అక్రమ అక్రిడేషన్, అసెంబ్లీ పాసు చూపించి ఆమ్యామ్యా చేయడం పరిపాటిగా మారింది. ఇదే కాకుండా నకిలీ ఐడి కార్డుల ఫ్యాక్టరీ కూడా పెట్టి దేశంలో లేని పత్రికలు, అదే సైకిల్ ట్యూబ్ ఛానెల్స్ పేరుతో ఐడి కార్డులు ఇస్తే అందంగా మాటలు చెప్పి అడ్డగోలుగా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.
ఇక అక్షరం ముక్కరాదు మంత్రులు పేర్లు కూడా తెలియక పోయిన వయస్సు పెరుగుతున్న సబ్ స్క్రయిబర్స్ ఎలా పెంచాలి, ఏ కంటెంట్ ఇస్తే వ్యూయర్స్ చూస్తారో తెలియక పోయిన ట్యూబ్ ల పేరుతో టీవీ మెకానిక్, సైకిల్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్ ఇలా వందలు వేలు కార్డులు పట్టుకుని తిరిగుతుంటే అక్రమ నిర్మాణ దారులు, అక్రమ రేషన్ దారులు, అవినీతి అధికారులు, ఇలా బోలెడు పద్దతుల్లో దోచుకుని దాచుకుని జల్సా గా జీవించేందుకు సిద్ధ మవుతున్నారు.
మళ్లీ వీరంతా పెద్ద పెద్ద పలుకుబడి గలిగి, ఎవరైనా వీరి భాగోతం బైట పెడితే వీరి అవినీతి జీవితం తెలిస్తే అక్రమాల అందమైన జీవితం అభాసుపాలు అవుతుందని రాసే వారి అడ్రెస్ లు ఆరా తీయడం, రాసే వాడి కుటుంబ వివరాలు తెలుసుకోవడం, బలము బలహీనతలు తెలుసుకుని భయబ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నాలు చేయడానికి సిద్దమవుతున్న పరిస్థితి కూడా ఉందని సమాచారం తెలుస్తోంది. ఇలా ఎంత మందిని ఏమి చేస్తారో మరి ఈ అవినీతి తిమింగిళాలు. వీరే శాస్వితం అని భావించి నట్లు ఉన్నరేమో మరి…కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న సత్యాన్ని విస్మరిస్తే కాల గర్భంలో కలిసిపోక తప్పదన్న లోకోత్తర ధర్మాన్ని ఒక సారి గుర్తుచేసుకుంటే వీరికి కొంచెమైన ఈ సమాజంలో గుర్తింపు వస్తుందని ఆశిద్దాం ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article