అక్రమ కట్టడాల గోడలు అడిగితే చెబుతాయి
నిర్మాణ దారులను కదిలిస్తే విప్పుతారు గుట్టు…
కనిపెడితే చేలాన కడతారంట..
మున్సిపల్ చట్టాలు కూడా మార్పు చేయొచ్చుట…
జీతాలేందుకు నిలుపుదల చేశారంటే…
విజిలెన్స్ నివేదికలు బుట్టదాకలు అయ్యినట్లేనా…
విజిలెన్స్ విచారణ ఉంటే ఇన్ని బాధ్యతలు ఎలా ఇచ్చారు ..
ఈయనకే ఇన్ని వార్డులు ఎందుకిచ్చినట్లో…
ఈ అక్రమ కట్టడాల్లో ఎవరి వాటాలు ఎంతో…
కార్పొరేటర్లు ఉన్నది ఇందుకేనా…
కాసుల కోసం కక్కుర్తి పడేవారు ప్రజల కష్టాలు తీరుస్తారా…
నాటీ కమిషనర్ ఏమి చర్యలు తీసుకున్నట్లో…
నేటి కమిషనర్ ఇంకేమి చేయలేడేమో…
ఇన్ని అక్రమాలు చేసిన చూస్తూ ఉండి పోతారా ..
ఈ ప్రభుత్వమూ ఇలానే వదిలేస్తుందా…
ఇక ప్రజల గతి ఏమిటో మరి…
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
వినారా వినారా నరుడా ఈ గంధం ప్రసాద్ వీర గాధలు అనే పాటను పాడిస్తే అప్పటికయిన బెజవాడ మున్సిపల్ అధికారులు,ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలిగి కనీసం కార్పొరేషన్ లో ఉన్న గుంట నక్కల కు తగిన గుణపాఠం చెబుతారని ఆశించాలి.
నవ్విపోదురు గాక నాకేల సిగ్గు అన్న చందానా నాలుగు రూపాయలు వెనకేసుకుని నాలుగు తరాలు హాయిగా జీవించడానికి చేయరాని తప్పుడు పనులు చేసినా తప్పు జరిగినట్లు సాక్ష్యాలు రుజువులు అన్నీ ఉన్నా కూడా సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోక పోయిన పర్వాలేదు కానీ గతం కంటే ఎక్కువ బాధ్యతలు అప్పగించి మరీ అప్పనంగా దోచుకుని దాచుకో అయ్యా అని చేష్టలుడిగి చోద్యం చూస్తున్న అధికారులను బెజవాడ కార్పొరేషన్ లోనే చూస్తుండడం చాలా విడ్డురంగా ఉంది.
బెజవాడ కార్పొరేషన్ లో కావల్సినంత కాసులు కొట్టేసి విశాఖ కార్పొరేషన్ కు బదిలీ చేస్తే అక్కడ చక్కగా ఊడ్చివేసి మళ్లీ బెజవాడ కార్పొరేషన్ కు వస్తే అక్కడ ఇక్కడ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించి పెద్ద స్థాయిలో నోట్లు కూడబెట్టుకున్నట్లు విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చి సంజాయిషీపై సంతృప్తి చెందక జీత భత్యాలు ఆపిన కూడా అలాంటి అధికారికి 23 డివిజన్ల బాధ్యతలు ఇచ్చి పుల్ పవర్స్ ఇచ్చేసిన అధికారులను ఏకంగా నవ్యాంధ్రప్రదేశ్ లో చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడే చూడాల్సి రావడం దారుణం.
ఇంకొక దారుణం ఏమిటంటే ప్రజల ఎన్నుకోబడి ఆయా వార్డు ప్రజలని ఉద్దరిస్తామని చెప్పుకు తిరిగిన తిరుగుతున్న కార్పొరేటర్లు అక్రమ నిర్మాణాల విషయంలో కార్పొరేషన్ కు చలానాలు కట్టించకుండా కక్కుర్తి పడి వీరి ఏలుబడి సాగుతోందని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.ఇలాంటి అవినీతి అధికారులు ను అడ్డుపెట్టుకొని నీకింత నాకింత అనే తరహాలో వాటాలు పంచుకుని అక్రమ కట్టడాలను యథేచ్ఛగా ప్రోత్సహించారు.
ఇప్పుడు కొత్తగా తెరమీదికి ఆచ్చర్యము కలిగించే విషయాలు వస్తున్నాయి.భవానిపురం ఐరన్ యార్డ్ లో ఓ షెడ్ నిర్మాణం జరుగుతూ ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోయింది.ఏ చట్టం గంధం ప్రసాద్ రాజ్యాంగం ప్రకారం. ఎలాంటి అనుమతులు లేకుండా తన జేబుకు చలానా కట్టించారు.ప్రజాభూమి వరుస కథనాలు ఇస్తుంటే ఇప్పుడు కార్పొరేసన్ కు ముష్టి వేసినట్లు కొంచెం ఓ పాతిక వేలో చలానా కట్టించి నట్లు ఈ గంధం అనుచరులు చెప్పుకొస్తున్నారు.అలా అయితే అదే ఐరన్ మార్కెట్ యార్డ్ లో కమర్షియల్ తో కూడిన గృహ నిర్మాణం చేపట్టారు.మరి దీని సంగతి ఏమిటంటే చలానా ఉంది అనుమతులు ఉన్నాయి …ఏ అనుమతులు ఎవరు ఎలా ఇచ్చారు… కార్పొరేషన్ కు గండి ఎలా కొట్టి మన బినామీ బ్యాన్క్ ఖాతాలోకి ఎంత వెళ్ళింది..మన కుక్క బిస్కెట్ లు ప్రతి నెల తినే నకిలీ గాళ్లకు ఎంత ముట్టజెప్పారో మరి.అందుకే అయ్యో ఆయన ఉద్యోగం విరమణ చెందుతుంటే అల్లాడి పోతు ఆయన్ను బెదిరిస్తున్నారని కాకి గోల,తప్పుడు రాతలు రాస్తూ తమ అవినీతి చెప్పకనే చెబుతున్నారు.ఇన్ని అక్రమాలు చేసిన ఈ తప్పుడు అధికారులపై ఏమి చర్యలు తీసుకోబోతున్నారో వీటన్నిటి పై ద్యాస పెట్టిన కమిషనర్ ధ్యాన చందర్ తీసుకునే చర్యలు బట్టి అర్ధమవుతుంది.