వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు
జర్నలిస్టులను ఫోటోలు తీసిన సీఎం
వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సిఎం వారిని ఆప్యాయంగా పలకరించారు.
వారి చేతిలో కెమేరాను తీసుకుని స్వయంగా సిఎం ఫోటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఈ రంగంలో ప్రతిభ చూపుతున్న వారిని అభినందించారు. నాణ్యమైన సేవలతో ఫోటోగ్రఫీ రంగం బాగుండాలని సిఎం ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేస్తున్న సీనియర్ ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు.