Friday, November 29, 2024

Creating liberating content

టాప్ న్యూస్శ్రీసిటీలో సీఎం చంద్రబాబు హైడ్రామా:గుడివాడ అమర్‌నాథ్‌

శ్రీసిటీలో సీఎం చంద్రబాబు హైడ్రామా:గుడివాడ అమర్‌నాథ్‌

-విశాఖపట్నంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రెస్‌మీట్‌
-శ్రీసిటీలో మా ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు
-ఇప్పుడు వాటికే చంద్రబాబు ప్రారంభోత్సవాలు
-ఇంకా శంకుస్థాపనలు, ఎంఓయూల ప్రహసనం
-చంద్రబాబుది ఎప్పుడూ ప్రచార ఆర్భాటమే
-వేరొకరి కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడం
-అదే ఎప్పుడూ చంద్రబాబు నిస్సిగ్గు వ్యవహారం
-ప్రెస్‌మీట్‌లో గుడివాడ అమర్‌ నాథ్‌ చురకలు

ప్రజాభూమిప్రతినిధి,
విశాఖపట్నం:
శ్రీసిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు.
శ్రీసిటీలో తమ హయాంలో పరిశ్రమలు ఏర్పాటు కాగా, ఇప్పుడు వాటికి చంద్రబాబు ప్రారంభోత్సవాలు, ఇప్పటికే పనులు మొదలు పెట్టిన కంపెనీలకు శంకుస్థాపనలు, ఎప్పుడో కుదిరిన ఒప్పందాలకు మళ్లీ ఒప్పం దాలు చేస్తున్నారని, చంద్రబాబుది ఎప్పుడూ ప్రచార ఆర్భాటమే అని స్పష్టం చేశారు. వేరొకరి కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడం.. అదే ఎప్పటికీ చంద్రబాబు నిస్సిగ్గు వ్యవహా రం అని చురకలంటించారు. విశాఖలో నాడు తమ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)లోని ఒప్పందాలన్నీ దాదాపు కార్యరూపం దాల్చాయని మాజీ మంత్రి గుర్తు చేశారు.
ఇప్పుడు వాటికే తిరిగి ప్రారంభోత్సవాలు చేస్తూ, ఏకంగా 16 పరిశ్రమలు ఏర్పాటైనట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. వందల కోట్లతో ఏర్పాటయ్యే పరిశ్రమల పనులకు కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని గుర్తు చేసిన ఆయన, ఈరోజు చంద్రబాబు ప్రారంభించిన వాటిలో ఏ ఒక్కటీ ఈ ప్రభుత్వంలో వచ్చినవి కావని స్పష్టం చేశారు. అలాగే తమ ప్రభుత్వ హ యాం లో కొన్నింటి శంకుస్థాపనలు చేయగా, మరి కొన్నింటికి భూకేటాయింపులు జరిగాయని, ఇప్పుడు వాటన్నింటినీ సీఎం చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
దాదాపు రెండు న్న ర ఏళ్లు కోవిడ్‌ సంక్షోభం ఉన్నా, 2023 మార్చిలో విశాఖలో జీఐఎస్‌ నిర్వహించి, 386కు పైగా ఒప్పందాలు చేసుకున్నామన్న గుడివాడ అమర్‌నాథ్, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న డ్రామాలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు నాటి ఎంవోయూలకు సాక్ష్యాలని తేల్చి చెప్పారు. శ్రీసిటీలో పలు అంతర్జాతీయ ఉత్పత్తి సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహిం చేలా అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొందరికి వీసా సమస్య వస్తే, కేంద్రంతో మాట్లాడి వీసాలు ఇప్పించామని వివరించారు. అందుకే ఇకనైనా వాస్త వాలను మననం చేసుకుని, తమ ప్రభు త్వంపై నిందలు మానాలని, దుష్ప్రచారాలు విడనాడాలని, ప్రచార ఆర్భాటం వదిలి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని, వేరొకరి క్రెడిట్‌ తమ ఖాతాలో వేసుకోవడం వంటి నిస్సిగ్గు వ్యవహారాలు వదిలిపెట్టాలని సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ హితవు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article