మహిళల భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ మరియు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రాబోయే 10వ మహిళల బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) ఎడిషన్ కోసం అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మంధానకు డబ్ల్యూబీబీఎల్‌లోని నాలుగో జట్టు అవుతుంది, గతంలో ఆమె బ్రిస్బేన్ హీట్, హోబర్ట్ హరికేన్స్, సిడ్నీ థండర్ జట్లకు ప్రాతినిధ్యం వహించింది.ఈ ఒప్పందంతో మంధాన, డబ్ల్యూబీబీఎల్ ప్రీ-డ్రాఫ్ట్ ఓవర్సీస్ కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచింది. మంధాన ఇప్పటివరకు తన కెరీర్‌లో 28.86 సగటు, 122.51 స్ట్రైక్ రేట్‌తో 3,493 పరుగులు చేసింది, ఇందులో 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి.మంచి ప్రదర్శనతో పాటు, మంధాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించింది.అడిలైడ్ స్ట్రైకర్స్ మంధానను తమ జట్టులోకి ఆహ్వానిస్తూ, ప్రత్యేకంగా ఆమె గురించి ట్వీట్ చేయడం గమనార్హం. “రాబోయే డబ్ల్యూబీబీఎల్ 10వ ఎడిషన్ కోసం మాతో చేరుతున్న ఇండియన్ సూపర్ స్టార్‌కు వెల్‌కం” అంటూ పోస్ట్ చేశారు.డబ్ల్యూబీబీఎల్ 10వ సీజన్ అక్టోబర్ 27న ప్రారంభం కానుంది, అడిలైడ్ ఓవల్ వేదికగా మొదటి మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్, బ్రిస్బేన్ హీట్ జట్లు తలపడనున్నాయి.