కోలీవుడ్ అగ్రహీరో అజిత్ కుమార్, తన సాహసకృత్యాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా, ఆయన తన ఆడీ కారును గంటకు 234 కిలోమీటర్ల వేగంతో నడిపిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అజిత్‌కు కార్ రేసింగ్ అంటే ఎంత ఇష్టం ఉందో ఈ వీడియోతో మరోసారి నిరూపితమైంది.ఈ వీడియోను చూసిన అజిత్ అభిమానులు ఆశ్చర్యపోతూ, ఆయన వేగంపై ప్రశంసలు కురిపించారు. “ఎన్నా స్పీడ్ తలా” అంటూ కామెంట్లు చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగింది, అజిత్ కారు ఎక్కడ నడిపారనే విషయాలు స్పష్టంగా తెలియలేదు. ఇది విదేశాలలోనే జరిగి ఉంటుందని భావిస్తున్నారు, ఎందుకంటే అక్కడి రోడ్ల నిర్మాణం అత్యధిక వేగానికి అనుకూలంగా ఉంటుంది.అయితే, ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అజిత్ ఇంటర్నేషనల్ ఎఫ్ఐఏ రేసింగ్ ఛాంపియన్ షిప్‌లలో పాల్గొన్న శిక్షణ పొందిన రేసర్ అయినా, ఆయనను అనుకరించే అభిమానులు ప్రమాదకరమైన వేగంతో కార్లు నడిపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియోతో, అతి వేగం ప్రమాదకరమని మరియు రోడ్లపై జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని భావనను పునరుద్ధరించడం జరిగింది.